BREAKING: ముగిసిన తెలంగాణ కేబినెట్ భేటీ.. తీసుకున్న నిర్ణయాలు ఇవే..!

తెలంగాణ కేబినెట్ భేటీ ముగిసింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో సమావేశమైన మంత్రి మండలి పలు కీలక అంశాలపై

Update: 2024-06-21 13:03 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కేబినెట్ భేటీ ముగిసింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో సమావేశమైన మంత్రి మండలి పలు కీలక అంశాలపై సుధీర్ఘంగా చర్చించింది. ఈ క్రమంలోనే రైతు రుణ మాఫీపై కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన రూ.2 లక్షల రైతు రుణమాఫీకి మంత్రి మండలి తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2023 డిసెంబర్ 9వ తేదీకి ముందు తీసుకున్న పంట రుణాలను ఏక కాలంలో మాఫీ చేయాలని కేబినెట్ నిర్ణయించింది.

ఈ మేరకు కేబినెట్ నిర్ణయాలను మరికాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి మీడియాకు వివరించనున్నారు. రైతు రుణమాఫీ విధివిధాలను ప్రకటించినున్నారని సమాచారం. ఆగస్ట్ 15వ తేదీలోపు రుణా మాఫీ పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు ఛాలెంజ్ చేయడంతో అధికారులు ఆ దిశగా కసరత్తు చేపట్టారు. జూలై చివరి వారం నుండి మాఫీ ప్రక్రియను స్టార్ట్ చేసి సీఎం రేవంత్ రెడ్డి విధించిన డెడ్ లైన్ ఆగస్ట్ 15 నాటికి రెండు లక్షల మాఫీ ప్రాసెస్‌ను కంప్లీట్ చేసే విధంగా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. 


Similar News