Telangana Budget 2023: షెడ్యూల్ కులాల డెవలప్‌మెంట్‌కు కేటాయింపులివే!

షెడ్యూల్ కులాలు, తెగల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రగతి నిధి చట్టాన్ని అమలు చేస్తోందని హరీష్ రావు అన్నారు.

Update: 2023-02-06 08:55 GMT

దిశ, వెబ్‌డెస్క్: షెడ్యూల్ కులాలు, తెగల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రగతి నిధి చట్టాన్ని అమలు చేస్తోందని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. సోమవారం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం ఆయన షెడ్యూలు కులాల ప్రగతిపై మాట్లాడారు. బడ్జెట్ లో షెడ్యూల్ కులాల ప్రత్యేక ప్రగతి నిధి కింద రూ.36, 750 కోట్లు ప్రతిపాదిస్తున్నామన్నారు.

దళిత విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించడానికి అంబేడ్కర్ ఓవర్సీస్ స్కాలర్ షిప్ కింద రూ.20లక్షల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందిస్తోందని తెలిపారు. ఇక గిరిజన సంక్షేమం కోసం రూ. 15, 233 కోట్లు ప్రతిపాదిస్తున్నట్లు ప్రకటించారు. కాగా దళితుల అభివృద్ధిలో భాగంగా మునుపెన్నడూ లేని విధంగా ప్రతి దళిత కుటుంబానికి రూ. 10లక్షల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో దళిత బంధు పథకానికి ఈ బడ్జెట్ లో రూ.17,700 కోట్లు ప్రతిపాదిస్తున్నామన్నారు. 

Read More..


Telangana Budget- 2023: విద్యారంగానికి రూ.19,093 కోట్లు

Tags:    

Similar News

టైగర్స్ @ 42..