Telangana Budget 2023: బడ్జెట్.. సంక్షేమానికి భారీగా నిధులు
తెలంగాణ అసెంబ్లీలో 2,90,396 కోట్లతో రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారీ బడ్జెట్‌ను మంత్రి హరీశ్ రావు ప్రవేశ పెట్టారు.
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీలో 2,90,396 కోట్లతో రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారీ బడ్జెట్‌ను మంత్రి హరీశ్ రావు ప్రవేశ పెట్టారు. ఇందులో తెలంగాణలో వివిధ సంక్షేమ రంగానికి ఈ సారి భారీగా నిధులు ప్రతిపాదించడం జరిగింది.
తెలంగాణలోని వివిధ సంక్షేమ రంగాలకు నిధులివే..
- ఎస్సీ ప్రత్యేక నిధి కోసం రూ. 36,750 కోట్లు
- దళితబంధు కోసం రూ. 17,700 కోట్లు
- గిరిజన సంక్షేమం, ప్రత్యేక ప్రగతి నిధికి రూ. 15,223 కోట్లు
- బీసీ సంక్షేమం కోసం రూ. 6,229 కోట్లు
- కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు రూ. 3,210 కోట్లు
- మైనార్టీ సంక్షేమం కోసం రూ. 2,200 కోట్లు
- మహిళా, శిశు సంక్షేమం కోసం రూ. 2,131 కోట్లు.
Also Read..