ఢిల్లీ ఎగ్జిట్‌ పోల్స్‌పై తెలంగాణ బీజేపీ MP స్పందన

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల(Delhi Assembly Elections) ఫలితాలపై తెలంగాణ బీజేపీ(Telangana BJP) ఎంపీ రఘునందన్ రావు(Raghunandan Rao) కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2025-02-05 14:23 GMT
ఢిల్లీ ఎగ్జిట్‌ పోల్స్‌పై తెలంగాణ బీజేపీ MP స్పందన
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల(Delhi Assembly Elections) ఫలితాలపై తెలంగాణ బీజేపీ(Telangana BJP) ఎంపీ రఘునందన్ రావు(Raghunandan Rao) కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అన్నారు. దాంతో పాటు ఢిల్లీలో BJP గెలుపునకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. ఎప్పుడూ సర్వేలు ప్రామాణికం కాదని అన్నారు. ఈసారి ఢిల్లీలో కాషాయ జెండా గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వేపై రఘునందన్ రావు సెటైర్ వేశారు. కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు కులగణన సర్వే ఉందని విమర్శించారు. కులగణనపై రెండు ప్రభుత్వాల తీరు ఒక్కటే అన్నారు. బీసీలను మోసం చేయడానికే కులగణన సర్వే చేశారని ఆరోపించారు. తరచూ బీసీ రాగం పాడటం కాదని.. దమ్ముంటే బీసీ సామాజికవర్గానికి చెందిన వ్యక్తిని రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి సీఎం చేయాలని సవాల్ చేశారు.

ఇదిలా ఉండగా.. ఢిల్లీ ఎన్నికలపై ఇప్పటివరకు విడుదలైన ఎగ్జిట్ పోల్స్ అన్నీ బీజేపీకే మొగ్గుచూపుతున్నాయి. రెండున్నర దశాబ్దాలకు పైగా అధికారానికి దూరంగా ఉన్న కాషాయ పార్టీకి ఈసారి ప్రజలు కట్టం కట్టినట్లు తెలుస్తోంది. ఢిల్లీ అసెంబ్లీలో 70 స్థానాలుండగా.. మెజార్టీ మార్కు 36. ఆప్‌ 32 నుంచి 37 స్థానాల్లో గెలుస్తుందని మాట్రిజ్‌ సంస్థ అంచనా వేయగా.. బీజేపీకి 35-40 సీట్లు వస్తాయని తెలిపింది. వీప్రిసైడ్‌ అనే సంస్థ ఆప్‌కు 46-52, బీజేపీకి 39-45 సీట్లు వస్తాయని పేర్కొంది. ఇలా కొన్ని సర్వేలు మినహా మిగతావన్నీ బీజేపీనే అధికారంలోకి వస్తుందని అంచనా వేశాయి.

Tags:    

Similar News