నాలుగో జాబితాపై టీ బీజేపీ కసరత్తు.. నేడు ఢిల్లీకి కిషన్ రెడ్డి
ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ మొదలు కావడం, 10వ తేదీ వరకు
దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ మొదలు కావడం, 10వ తేదీ వరకు నామినేషన్లు దాఖలు చేసేందుకు సమయం ఉండటంతో మిగిలిన స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయడంపై టీ బీజేపీ దృష్టి పెట్టింది. ఇప్పటివరకు మూడు జాబితాలు విడుదల చేసిన బీజేపీ.. 88 మంది అభ్యర్థులను ఖరారు చేసింది. ఇక మిగిలిన 31 సీట్లకు వీలైనంత త్వరగా అభ్యర్థులను ప్రకటించే ప్రయత్నాల్లో ఉంది. ఇందులో భాగంగా నేడు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఇతర ముఖ్య నేతలు ఢిల్లీ వెళ్లనున్నారు.
కిషన్ రెడ్డితో పాటు బండి సంజయ్, ఈటల రాజేందర్, డీకే అరుణ ఢిల్లీ బయల్దేరనున్నారు. జనసేనకు కేటాయించాల్సిన సీట్లపై క్లారిటీ, మూడో జాబితా సిద్దంపై అధిష్టానంతో చర్చించనున్నారు. జనసేనకు 8 నుంచి 10 స్థానాలను బీజేపీ కేటాయించనుందనే వార్తలొస్తున్నాయి. కూకట్ పల్లితో పాటు శేరిలింగంపల్లి, తాండూరు సీట్లను కేటాయించనున్నారని తెలుస్తోంది. దీనిపై పార్టీ అధిష్టానంతో చర్చించనుండగా.. మూడు, నాలుగు రోజుల్లో బీజేపీ నాలుగో జాబితా విడుదల కానుందని తెలుస్తోంది.