ఆర్టీసీ వర్సెస్ ఆటో.. బస్సులో ఎమ్మెల్సీ, ఆటోలో ఎమ్మెల్యే.. ఎందుకో తెలుసా?

నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అయితే సమావేశాలు జరగనున్న నేపథ్యంలో అసెంబ్లీకి ప్రజాప్రతినిధులు ఒక్కరోకరిగా వస్తున్నారు.

Update: 2024-02-08 07:33 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అయితే సమావేశాలు జరగనున్న నేపథ్యంలో అసెంబ్లీకి ప్రజాప్రతినిధులు ఒక్కరోకరిగా వస్తున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరు ప్రజా ప్రతినిధులు తమ సొంత వాహనాల్లో కాకుండా ప్రజా రవాణాలో అసెంబ్లీకి చేరుకున్నారు.

ఈ నేపథ్యంలోనే మొదటి రోజు అసెంబ్లీకి యువ ఎమ్మెల్సీ, స్టూడెంట్ లీడర్ బల్మూరి వెంకట్ ఆర్టీసీ బస్సులో అసెంబ్లీకి చేరుకున్నారు. నాంపల్లిలో బస్సు ఎక్కిన అయిన అసెంబ్లీకి వచ్చారు. ఈ క్రమంలోనే ప్రయాణికుల సాధకబాధకాలు అడిగి తెలుసుకున్నారు. మరోవైపు ఉచిత బస్సు ప్రయాణంపై మహిళలతో మాట్లాడిన వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. ఎమ్మెల్సీ సింప్లిసిటీని నెటిజన్స్ మెచ్చుకుంటున్నారు.

బీఆర్ఎస్ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అసెంబ్లీకి ఆటోలో వచ్చారు. దీంతో కొంత ఆందోళన వాతావరణం ఏర్పడింది. వెహికల్ పాస్ లేదని ఆటోను పోలీసులు అసెంబ్లీ ఆవరణలోకి అనుమతించలేదు. ఈ ఘటనలపై నెటిజన్లు స్పందించారు. ప్రజల కష్టాలు తెలుసుకోవాలంటే ప్రభుత్వ ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తే తెలుస్తదని, ఈ విధంగా ఆటోలో వస్తే తెలియదని.. కౌశిక్ రెడ్డిని విమర్శిస్తున్నారు. కాగా, మహిళలకు ఉచిత బస్సు పథకంలో భాగంగా ఆటో డ్రైవర్లకు జరుగుతున్న నష్టాన్ని నిరసిస్తూ ఆటోలో అసెంబ్లీకి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వచ్చారు.

Tags:    

Similar News