CM Revanth Reddy: భవిష్యత్ లో క్రీడల విశ్వవేదికగా తెలంగాణ: సీఎం రేవంత్ రెడ్డి

భవిష్యత్ లో క్రీడల విశ్వ వేదికగా తెలంగాణ-హైదరాబాద్ మారుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.

Update: 2024-09-10 05:29 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: భవిష్యత్ లో క్రీడల విశ్వ వేదికగా తెలంగాణ-హైదరాబాద్ మారుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆ దిశగా ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని చెప్పారు. హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన ఇంటర్ కాంటినెంటల్ ఫుట్ బాల్ కప్ ఫైనల్స్ లో విజేతలైన సిరియా టీమ్ కు సీఎం అభినందలు తెలిపారు. ఇంటర్ కాంటినెంటల్ ఫుట్ బాల్ మ్యాచ్ కు హైదరాబాద్ వేదికగా నిలవడం హర్షించదగ్గ విషయం అన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి ట్వీట్ చేశారు.

ఐలమ్మకు సీఎం నివాళి:

తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు వీరనారి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా ఘన నివాళి అర్పించారు. ఐలమ్మ వీర నారీ అని, పెత్తందార్ల పై విజయభేరి మోగించారని ఆమె పోరాట స్ఫూర్తిని కొనియాడారు.


Similar News