Malaysia: టీ కన్సల్ట్ ద్వైపాక్షిక సమావేశంలో తెలంగాణ, సెలంగోర్ బంధం బలోపేతం

మలేషియా(Malaysia)లోని హిల్టన్ కౌలాలంపూర్(Hilton Kuala Lumpur) హోటల్‌లో సోమవారం టీకన్సల్ట్(Teaconsult) ఆధ్వర్యంలో జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Duddilla Sridhar Babu), మలేషియా ఏంపీ సెలంగోర్ ప్రావిన్స్ డిప్యూటీ ప్రెసిడెంట్(Malaysian MP Selangor Province Deputy President) గణబతిరావు వీరమన్(Ganabathi Rao Weeraman) పాల్గొన్నారు.

Update: 2024-11-11 16:53 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : మలేషియా(Malaysia)లోని హిల్టన్ కౌలాలంపూర్(Hilton Kuala Lumpur) హోటల్‌లో సోమవారం టీకన్సల్ట్(Teaconsult) ఆధ్వర్యంలో జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Duddilla Sridhar Babu), మలేషియా ఏంపీ సెలంగోర్ ప్రావిన్స్ డిప్యూటీ ప్రెసిడెంట్(Malaysian MP Selangor Province Deputy President) గణబతిరావు వీరమన్(Ganabathi Rao Weeraman) పాల్గొన్నారు. సుదీర్ఘంగా చర్చించారు. సాంకేతిక పరిజ్ఞానం, స్కిల్ డెవలప్మెంట్, విద్యా కార్యక్రమాలు ఇరుప్రాంతాల ప్రజలకు ప్రయోజనకరంగా నిలిచే విధంగా రూపొందించాలనే ఉద్దేశ్యంతో చర్చించారు. మలేషియా విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ సదుపాయాలను కల్పించేందుకు టీకన్సల్ట్ ఆధ్వర్యంలో హైదరాబాదుకు రానున్న ఈ కార్యక్రమాలు పలు అంశాలను చర్చించారు.

విద్యార్థులకు నైపుణ్యాలను అందించడమే కాకుండా, భారత్ మలేషియా మధ్య మరింత బలమైన సంబంధాలను నెలకొల్పడం లక్ష్యంగా ఉన్నాయి. తెలంగాణలో జరిగిన సాంకేతిక పురోగతులు, డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను స్వయంగా చూసేందుకు గణబతిరావును తెలంగాణ రాష్ట్రానికి ఆహ్వానించినట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ప్రజల ప్రయోజనార్థం ప్రభుత్వం నుంచి ప్రభుత్వం (జీ2జీ) సమావేశాలను టీకన్సల్ట్ సహకారంతో సమన్వయించాలని కోరారు. హైదరాబాద్ శ్రేణిమైన సాంకేతికత , అంతర్జాతీయ అనుసంధాన కేంద్రంగా పేరుపొందేందుకు ఈ సమావేశం ప్రాధాన్యత కలిగి ఉందని టీకన్సల్ట్ ఛైర్మన్ సందీప్ మక్తల (TeaConsult Chairman Sandeep Maktala) తెలిపారు.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..