Teenmar Mallanna: వరద బాధితులకు తీన్మార్ మల్లన్న భారీ విరాళం

వరద బాధితులకు పట్టభద్రుల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న భారీ సాయం ప్రకటించారు.

Update: 2024-09-03 06:41 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: వరద బాధితులకు పట్టభద్రుల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న భారీ సాయం ప్రకటించారు. ఎమ్మెల్సీగా తన ఒక నెల జీతాన్ని సీఎం సహాయ నిధికి విరాళంగా అందజేస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో భారీ స్థాయిలో వచ్చిన వరదల కారణంగా దాదాపు 5 వేల కోట్ల నష్టం వాటిల్లిందని అన్నారు. ఈ మూడు జిల్లాల్లో జనజీవనం స్థంభించిందని, ప్రజల నిత్యావసరాలు వరదలో చిక్కుకుపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రాణ, ఆస్తి నష్టం జరిగిందని తెలిపారు.

వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీగా నన్ను గెలిపించిన ప్రజలు కష్టాల్లో ఉన్న విచారకరమైన సందర్భంలో వరద బాధితులను ఆదుకోవడానికి ఎమ్మెల్సీగా తనకు వచ్చే నెల జీతం 2 లక్షల 75 వేల రూపాయలను సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళంగా ఇస్తున్నట్లు చెప్పారు. వరద భాదితులు ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని తెలిపారు. అలాగే మిగిలిన ప్రజాప్రతినిధులు, మంత్రులు కూడా తమ నెల శాలరీ విరాళంగా ఇచ్చి వరద బాధితులను ఆదుకోవాలని తీన్మార్ మల్లన్న రిక్వెస్ట్ చేశారు.


Similar News