టికెట్ తెప్పించే బాధ్యత నాది.. గెలిపించే బాధ్యత మీది: తీన్మార్ మల్లన్న

రాష్ట్రంలో కులవృత్తులు అంతరించిపోతున్నాయని, కానీ ఆయా కులాలకు చెందినవారిని అధికారం దిశగా నడపించడానికి చేసే ప్రయత్నంలో భాగంగా తన వంతు కృషి చేస్తున్నానని తీన్మార్ మల్లన్న వ్యాఖ్యానించారు.

Update: 2023-02-28 17:25 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కులవృత్తులు అంతరించిపోతున్నాయని, కానీ ఆయా కులాలకు చెందినవారిని అధికారం దిశగా నడపించడానికి చేసే ప్రయత్నంలో భాగంగా తన వంతు కృషి చేస్తున్నానని తీన్మార్ మల్లన్న వ్యాఖ్యానించారు. ‘మేరు’ కులస్తులకు తెలుగుదేశం పార్టీ తరఫున టికెట్ (బీఫాం) తెప్పించే మాధ్యతను తాను తీసుకుంటానని, కానీ వారిని గెలిపించే బాధ్యతను మీరు (టైలర్లను ఉద్దేశించి) తీసుకోవాలన్నారు. ఉజ్జయిని మహంకాళి టైలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన టైలర్స్ డే కార్యక్రమానికి చీఫ్ గెస్టుగా హాజరైన తీన్మార్ మల్లన్న పై వ్యాఖ్యలు చేశారు. ఏ జాతి అధికారానికి దూరంగా ఉంటుందో ఆ కులం అంతరించిపోవడం ఖాయం అని రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ మాటలను మల్లన్న గుర్తుచేశారు.

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ మొదటగా నాయి బ్రాహ్మణులకు, ఆ తర్వాత రజకులకు, టైలర్లకే బీఫామ్ ప్రకటించాలని తాను కోరుకుంటున్నానని తెలిపారు. ‘మేరు’ కులస్తులకు బీఫామ్ ఇప్పించే ఇచ్చే బాధ్యతను తాను తీసుకుంటానని, ఆ బిడ్డను అసెంబ్లీ తీసుకెళ్లేదాక మీ వెంట ఉంటానని హామీ ఇస్తున్నానని అన్నారు. కానీ అసెంబ్లీలోకి పంపించే బాధ్యత మాత్రం మీ మీదనే ఉందన్నారు. అసోసియేషన్ గౌరవాధ్యక్షులు కర్ణ రాజు మాట్లాడుతూ, ప్రభుత్వాలే ఈ జాతిని నీరుగార్చాయని, స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్స్ పేరుతో కులవృత్తిని ధ్వంసం చేశాయన్నారు. తీన్మార్ మల్లన్న టీం స్టేట్ కమిటీ మెంబర్ మహేష్ గంగాపురం మాట్లాడుతూ, తెలంగాణ వస్తే కులవృత్తులు బాగుపడతాయన్న నినాదాన్ని పక్కన పెట్టి కులవృత్తులను నాశనం చేయాలని కంకణం కట్టుకున్న కార్పొరేట్ కంపెనీలకు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీలు ఇవ్వడానికి ఆలోచిస్తున్నదని, ఈ కులవృత్తులను నాశనం చేసిన పాపం బీఆర్ఎస్ పార్టీకే దక్కుతుందన్నారు.

Tags:    

Similar News