కన్నీరు పెట్టిస్తున్న జర్నలిస్ట్ యోగి కూతురు ఫ్రెండ్షిప్ డే విషేస్
యువ జర్నలిస్ట్ యోగి తన కూతరురికి ఉరి వేసి తాను ఆత్మహత్య చేసుకున్న సంఘటన వరంగల్ జిల్లాలో సంచలనంగా మారింది.
దిశ, వెబ్ డెస్కె: యువ జర్నలిస్ట్ యోగి తన కూతరురికి ఉరి వేసి తాను ఆత్మహత్య చేసుకున్న సంఘటన వరంగల్ జిల్లాలో సంచలనంగా మారింది. శుక్రవారం సాయంత్రం ఈ ఘటన జరిగినప్పటికీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.అయితే వారి మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ క్రమంలో జర్నలిస్ట్ యోగి కూతురు ఆద్య ఫ్రెండ్షిప్ డే సందర్భంగా అందిరికి విష్ చేస్తూ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ వీడియోలో ఫ్రెండ్ షిప్ డే గురించి చెబుతూ.. ఈ రోజుల్లో అందరూ ఫ్రెండ్షిప్ ను అందరూ స్వార్థం కోసం ఉపయోగించుకుంటున్నారు. కానీ నిజమైన స్నేహం అంటే పుట్టుక నుండి చావు వరకు మనకు ఏ కష్టం వచ్చినా మనతో తోడు ఉండే నిజమైన వ్యక్తే స్నేహీతుడని.. నేను నమ్మె ధర్మం సత్యమేవ జయతే.. జైహింద్ అంటూ చెప్పుకొచ్చింది. కాగా తండ్రి కూతుళ్ల ఆత్మహత్య తర్వాత ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుండగా.. నెటిజన్లను కన్నీరు పెట్టిస్తుంది.