ఏపీ మాదిరిగా తెలంగాణలోనూ పవర్‌లోకి టీడీపీ: నారా భువనేశ్వరి

రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో సైతం పార్టీ పూర్వ వైభవాన్ని చూస్తామని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సతీమణి, ఎన్టీఆర్ ట్రస్టీ

Update: 2024-06-18 16:30 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో సైతం పార్టీ పూర్వ వైభవాన్ని చూస్తామని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సతీమణి, ఎన్టీఆర్ ట్రస్టీ చైర్మన్ నారా భువనేశ్వరి స్పష్టం చేశారు. సోమవారం ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌కు వచ్చిన ఆమెను తెలంగాణ పార్టీ నాయకులు కలిశారు. టీడీపీ ఏపీలో అధికారంలోకి వచ్చినందుకు ఇబ్రహీంపట్నంనుంచి యాదాద్రికి పాదయాత్ర నిర్వహించిన పార్టీ నాయకులను ఆమె అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఏపీలో వచ్చిన మెజార్టీ లాగానే తెలంగాణలోనూ తెలుగుదేశం పార్టీ రాబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బక్కిని నరసింహులు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి రవీందర్, మీడియా కోఆర్డినేటర్ తెలుగుదేశం ప్రకాశ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Similar News