MLC Kavitha: కాంగ్రెస్ ప్రభుత్వంపై శాంతియుతంగా పోరాటం చేయాలి.. మీడియాతో ఎమ్మెల్సీ కవిత

హక్కులను సాధించుకోవడానికి తెలంగాణ ప్రజలు కేసీఆర్(KCR) చేపట్టిన దీక్షను స్ఫూర్తిగా తీసుకొని పోరాటాలు చేయాలని ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) పిలుపునిచ్చారు.

Update: 2024-11-29 17:13 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : హక్కులను సాధించుకోవడానికి తెలంగాణ ప్రజలు కేసీఆర్(KCR) చేపట్టిన దీక్షను స్ఫూర్తిగా తీసుకొని పోరాటాలు చేయాలని ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్(Telangana Bhavan)లో శుక్రవారం జరిగిన దీక్షా దివాస్(Deeksha Divas)లో పాల్గొన్న అనంతరం మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై శాంతియుతంగా పోరాటం చేయాలని అన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే అన్ని రంగాల్లో ప్రభుత్వం విఫలమైందని, అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందులు పెడుతూ రోడ్లపైకి తెచ్చిందన్నారు. స్వతంత్ర పోరాటం తర్వాత శాంతియుతంగా జరిగిన పోరాటం దేశంలో ఏదైనా ఉందంటే అది కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగిన తెలంగాణ మహోద్యమమేనన్నారు.

రాజ్యాంగపు హక్కులతోనే తెలంగాణ సాధించుకోవాలన్న సంకల్పంతో కేసీఆర్ తెలంగాణ సాధన కోసం ముందడుగు వేశారని వెల్లడించారు. రాజకీయ పంథాతో పాటు పోరాట పంథాను కూడా కొనసాగించాలంటే అది ఆమరణ నిరాహార దీక్ష ద్వారానే సాధ్యమని బలంగా విశ్వసించారని చెప్పారు. అందులో భాగంగానే ‘కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో’ అన్న నినాదంతో 2009 నవంబర్ 29న కేసీఆర్ దీక్ష చేపట్టారన్నారు. దీక్ష ప్రారంభించిన రోజు కేవలం తెలంగాణ ప్రజలకే కాకుండా దేశ ప్రజలకే స్ఫూర్తినిచ్చిన రోజు అన్నారు. తెలంగాణ ఉద్యమాన్నే కేసీఆర్ దీక్ష మలుపు తిప్పిందన్నారు. తెలంగాణ ప్రజల సమస్యల పరిష్కారంకోసం, వారికి అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని స్పష్టం చేశారు.

Tags:    

Similar News