ED: పీజీ మెడికల్ సీట్ల కుంభకోణం.. మాజీ మంత్రి మల్లారెడ్డికి షాకిచ్చిన ఈడీ

పీజీ మెడికల్ సీట్ల కుంభకోణం(PG medical seats scam)లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(Enforcement Directorate) అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

Update: 2024-11-29 17:29 GMT
ED: పీజీ మెడికల్ సీట్ల కుంభకోణం.. మాజీ మంత్రి మల్లారెడ్డికి షాకిచ్చిన ఈడీ
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: పీజీ మెడికల్ సీట్ల కుంభకోణం(PG medical seats scam)లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(Enforcement Directorate) అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. తెలంగాణలోని మెడికల్ కాలేజీ(Medical Colleges) యాజమాన్యాలకు భారీ షాక్ ఇచ్చారు. భారీగా మెడికల్ కాలేజీల ఆస్తులను సీజ్ చేశారు. మొత్తం రూ.9.71 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అధికారులు అటాచ్ చేశారు. అందులో బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి మల్లారెడ్డి(Mallareddy)కి కాలేజీకి చెందిన రూ.2.89 కోట్లను ఫ్రీజ్ చేశారు.

ఎమ్‌ఎన్‌ఆర్(MNR) మెడికల్ కాలేజీకి చెందిన రూ.2.01 కోట్లను సీజ్ చేశారు. చల్మెడ ఆనందరావు(Chalmeda Ananda Rao)కు మెడికల్ కాలేజీకి చెందిన రూ.3.33 కోట్లను అటాచ్ చేసినట్లు శుక్రవారం సాయంత్రం ప్రకటన విడుదల చేశారు. మేనేజ్‌మెంట్ కోటాలో పీజీ మెడికల్ సీట్లను బ్లాక్ చేసినట్లు గుర్తించారు. నీట్ పరీక్ష(NEET Exam)లో టాప్ ర్యాంకర్ల సర్టిఫికెట్లతో సీట్లు బ్లాక్ చేసినట్లు పేర్కొన్నారు.

Tags:    

Similar News