మెడికల్​పీజీలకు టాక్స్ భారం.. ఏకంగా పదిశాతం కటింగ్!

మెడికల్​పీజీలకు టాక్స్ భారం పడుతున్నది. గతేడాది నుంచి మొదలైన కొత్త రూల్​మెడికల్​పీజీలకు పెను భారంగా మారింది.

Update: 2023-04-13 23:45 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: మెడికల్​పీజీలకు టాక్స్ భారం పడుతున్నది. గతేడాది నుంచి మొదలైన కొత్త రూల్​మెడికల్​పీజీలకు పెను భారంగా మారింది. ఒక్కో విద్యార్ధి స్టైఫండ్​నుంచి ఏకంగా పదిశాతం కట్​చేయడం ఆందోళనకరం. ఏపీ, కర్ణాటకల్లో ఈ రూల్‌కు మినహాయింపు ఉన్నది. విద్యావ్యవస్థ విధానం ప్రకారం టాక్స్​ఉండకూడదనే నిబంధన ఉన్నది. కానీ, ప్రభుత్వం అవేమీ పట్టించుకోవడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. అకడమిక్​చివర్లో ఒకేసారి టీడీఎస్‌ను కట్​చేస్తున్నారు. ఇటీవల థర్డ్ ఇయర్ విద్యార్ధుల నుంచి ఒక్కొక్కరికి రూ.60 వేలు చొప్పున టీడీఎస్​తీసుకున్నారని పీజీలు అన్నారు. ఈ టీడీఎస్​విధానంతో పాటు ఆర్థిక భారం పడుతుదని, వెంటనే రద్దు చేయాలని పీజీలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే మెడికల్ ఎడ్యుకేషన్​ఆఫీసర్లకు రిక్వెస్ట్​లెటర్లను కూడా ఇచ్చినట్లు పీజీలు స్పష్టం చేశారు.

ఆందోళనలో 3 వేల మంది...

రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్​కాలేజీల్లో సుమారు 3 వేల మంది పీజీలు ఉన్నారు. అయితే ప్రభుత్వ కాలేజీల్లో స్టైఫండ్​ నుంచి టీడీఎస్‌ను తీసుకుంటున్నారు. సుమారు 1200 మంది విద్యార్థులు టీడీఎస్ కట్టాల్సి వస్తోన్నది. గాంధీ, ఉస్మానియా, నిమ్స్​తదితర ప్రభుత్వ కాలేజీలతో పాటు ఈఎస్ఐ సనత్ నగర్​మెడికల్​కాలేజీల్లోనూ టీడీఎస్‌ను వసూల్ చేస్తున్నారు. ఈఎస్ఐలో ప్రతి నెల స్టైఫండ్​నుంచి తీసుకుంటుండగా, గాంధీ, ఉస్మానియాల్లో పనిచేసే పీజీలకు సంవత్సరానికి ఒకసారి కట్ చేస్తున్నారు. అయితే ఈ రూల్ రద్దు చేయకపోయినా, కనీసం ఫామ్​ -16ను ఇస్తే, రిఫండ్​చేసుకునే వెసులుబాటు ఉంటుందని పీజీలు చెబుతున్నారు. ఇప్పటికే చాలా మంది విద్యార్ధులు ఆయా కాలేజీల అధికారులను అడిగినా.. సరైన సమాధానం ఇవ్వడం లేదని తెలిసింది.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..