విదేశాల్లో పనిచేసేందుకు టాంకాం దరఖాస్తుల ఆహ్వానం
తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ (టాంకాం) ఆధ్వర్యంలో విదేశాల్లో ఉపాధి పొందేందుకు దరఖాస్తులను ఆహ్వానింది టాంకాం.
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ (టాంకాం) ఆధ్వర్యంలో విదేశాల్లో ఉపాధి పొందేందుకు అర్హత, నైపుణ్యం కలిగిన సెమీస్కిల్డ్ కార్మికుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుందని టాంకాం సీఈవో విష్ణువర్థన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. గల్ఫ్ దేశాలతో పాటు ఆస్ట్రేలియా, కెనడా, జర్మనీ, హంగేరి, జపాన్, పోలాండ్, రొమేనియా, యూఏఈ, సౌదీ, యూకే లాంటి దేశాలలో ఉపాధి కోసం ప్రభుత్వం, టాంకాం, ప్రైవేట్ ఏజెన్సీలతో ఒప్పందాన్ని కుదుర్చుకుందన్నారు. జపాన్ లో ఆటోమోటివ్ టెక్నీషియన్లు, సెమీకండక్టర్ ఇంజనీర్లు, ఆటోమొబైల్ సర్వీస్, కస్టమర్ అసొసియేట్లకు డిమాండ్ ఉందన్నారు. ఈ ఉద్యోగాలకు మెకానికల్, ఎలక్ట్రికల్, ఆటోమోటివ్ ఇంజనీరింగ్, కన్స్ట్రక్షన్ మిషనరీలో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేట్ లేదా ఇంజనీరింగ్ డిగ్రీ ఉండాలని తెలిపారు. 30 ఏళ్ల వయస్సు కలిగి ఉండాలని, ఈ ఉద్యోగాలు ఆకర్షణీయమైన జీతం, ప్యాకేజీతో ఉంటాయని పేర్కొన్నారు. రిక్రూట్మెంట్ ప్రక్రియను సులభతరం చేయడంలో టాంకాం అభ్యర్థులకు సహాయం చేస్తుందన్నారు. అర్హత గల అభ్యర్థులు అప్డేట్ చేసిన రెజ్యూమ్ ను tomcom.resume@gmail.com మెయిల్ కి పంపించాలన్నారు. మరిన్ని వివరాల కోసం, www.tomcom.telangana.gov.inని సందర్శించడంతో పాటు టాంకాం సంస్థ ప్రతినిధులను 94400 48590 / 94400 51452 నెంబర్లలో సంప్రదించాలని కోరారు.