సమంతపై నా వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నా: మంత్రి కొండా సురేఖ

సమంత, నాగచైతన్యల విడాకులకు కేటీఆర్ కారణమని.. కాంగ్రెస్ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు దుమారంగా మారాయి.

Update: 2024-10-03 02:23 GMT

దిశ, వెబ్ డెస్క్: సమంత, నాగచైతన్యల విడాకులకు కేటీఆర్ కారణమని.. కాంగ్రెస్ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు దుమారంగా మారాయి. దీంతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోని ప్రముఖులు ఆమె వ్యాఖ్యలను ఖండించడమే కాకుండా.. నిరాధారిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేశారు. దీంతో తన వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి కొండా సురేఖ.. సమంతపై తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ట్విట్టర్ వెదికగా మంత్రి తన ట్వీట్‌లో ఇలా రాసుకొచ్చారు.."నా వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుడి చిన్నచూపు ధోరణిని ప్రశ్నించడమే కానీ మీ మనోభావాలను దెబ్బ తీయడం కాదు, స్వయం శక్తితో మీరు ఎదిగిన తీరు నాకు ఆదర్శం, నా వ్యాఖ్యల పట్ల మీరు కానీ, మీ అభిమానులు కానీ మనస్తాపానికి గురైనట్లయితే బేషరతుగా నా వ్యాఖ్యలను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నా.. అని తన ట్వీట్‌లో రాసుకొచ్చారు.

కాగా బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. నాగచైతన్య సమంత విడాకులు వంద శాతం కేటీఆర్ కారణంగా జరిగాయని.. ఎన్ కన్వెన్షన్ హాల్‌ను కూల్చొద్దంటే సమంతను తన దగ్గరికి పంపాలని కేటీఆర్ డిమాండ్ చేశాడని, కేటీఆర్ డిమాండ్ మేరకు సమంతను ఆయన వద్దకు వెళ్లాలని నాగార్జున ఫ్యామిలీ ఒత్తిడి చేశారని, సమంత కేటీఆర్ వద్దకు వెళ్ళనని నిరాకరించడంతో.. తాము చెప్పింది వినకపోతే ఇంటి నుంచి వెళ్ళిపొమ్మని చెప్పి ఆమెకు విడాకులు ఇచ్చారంటూ.. మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.


Similar News