మంత్రి కేటీఆర్‌పై హెచ్‌ఆర్సీలో T- కాంగ్రెస్ కంప్లైంట్

కేటీఆర్ జన్మదినం సందర్భంగా చొప్పదండి నియోజకవర్గంలో చిన్న పిల్లలను ఇబ్బంది పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని మానవ హక్కుల కమిషన్‌కు కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు

Update: 2023-07-25 15:10 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: కేటీఆర్ జన్మదినం సందర్భంగా చొప్పదండి నియోజకవర్గంలో చిన్న పిల్లలను ఇబ్బంది పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని మానవ హక్కుల కమిషన్‌కు కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసిందని టీపీసీసీ వైస్​ప్రెసిడెంట్ చామల కిరణ్​కుమార్​రెడ్డి పేర్కొన్నారు. బర్త్​డే సెలబ్రేషన్స్‌లో పిల్లలతో పనిచేయించడం ఏమిటనీ ప్రశ్నించారు. ఈ అంశంపై నేషనల్ చిల్డ్రన్​కమిషన్‌కూ వెళ్తామన్నారు.

మొక్కలు చనిపోతున్నాయని చర్యలు తీసుకుంటున్న కలెక్టర్లు.. చిన్న పిల్లలను ఇబ్బంది పెడుతుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. స్థానిక ఎమ్మెల్యే, సర్పంచులు 15 రోజుల పాటు పిల్లలను ఇబ్బంది పెట్టి కేటీఆర్ అనే పదం వచ్చే విధంగా కింద కూర్చోబెట్టి ఇబ్బందులు పెట్టడం సరికాదన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో బలహీన వర్గాలకు చెందిన వారు ఎక్కువగా ఉన్నారని, అలాంటి వారితో వర్క్​చేయించడం ఎంత వరకు కరెక్ట్? అని మండిపడ్డారు.

మహేష్​కుమార్​గౌడ్ మాట్లాడుతూ.. కేటీఆర్ మెప్పు పొందేందుకు స్థానిక బీఆర్ఎస్ నాయకులు దిగజారుతున్నారన్నారు. కేటీఆర్ జన్మదినం పేరుతో హంగు, ఆర్భాటాలు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ దరిపల్లి రాజశేఖర్ రెడ్డి, ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయ రెడ్డి, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి, అధికార ప్రతినిధులు సంధ్యారెడ్డి, అయోధ్య రెడ్డి, లింగం యాదవ్, వచన్ కుమార్, శ్రీకాంత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News