ఆర్టీసీ విలీనానికి బీజేపీ సంపూర్ణ మద్దతు.. కేంద్రమంత్రి, టీ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి

ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనానికి బీజేపీ సంపూర్ణ మద్దతు ఇస్తోందని కేంద్రమంత్రి, టీ బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి అన్నారు.

Update: 2023-08-06 06:59 GMT
Kishan Reddy Urges CM KCR to allot land for Ramagundam ESI Hospital
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనానికి బీజేపీ సంపూర్ణ మద్దతు ఇస్తోందని కేంద్రమంత్రి, టీ బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపారు. బీజేపీ ఆర్టీసీ కార్మికులకు ఎల్లప్పుడూ అండగానే ఉంటూ వస్తోందని, రానున్న రోజుల్లో కార్మికులకు మరింత అండగా ఉంటామని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కుట్రపూరిత రాజకీయాలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆర్టీసీ విలీనం విషయంలో తమ పార్టీని బద్నాం చేసేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఆర్టీసీ కార్మికులపై ప్రభుత్వానికి ప్రేమలేదని, ఆర్టీసీకి సంబంధించిన ఆస్తులపై మాత్రమే ప్రేమ ఉందని ఆరోపించారు. ఆర్టీసీకి వేల ఎకరాల భూములు ఉన్నాయని, ఆ భూములను అమ్మేందుకే కేసీఆర్ ఈ డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికులపై తమకున్న చిత్తశుద్ధిని కొత్తగా ఎవరికీ చెప్పుకోవాల్సిన పని  లేదని అన్నారు. 

Tags:    

Similar News