Supreme Court: గ్రూప్-1 కు సుప్రీంలో లైన్ క్లియర్.. అభ్యర్థులకు చుక్కెదురు

గ్రూప్-1 అభ్యర్థులకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది.

Update: 2024-10-21 07:41 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: గ్రూప్ - 1 మెయిన్స్ పరీక్షకు సుప్రీంకోర్టులో లైన్ క్లియర్ అయింది. ఈ సమయంలో పరీక్షల నిర్వహణలో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గ్రూప్ -1 పరీక్షను వాయిదా వేసేలా ఆదేశాలు ఇవ్వాలని పలువురు అభ్యర్థులు సుప్రీకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై సోమవారం విచారణ జరిపిన సీజేఐ ధర్మాసనం పరీక్ష వాయిదాకు నిరాకరించింది. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు సైతం ధర్మాసనం నిరాకరించింది. దీంతో షెడ్యూల్ ప్రకారం ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు గ్రూప్ 1 మెయిన్స పరీక్ష ప్రారంభం కానున్నది. మొత్తం 563 పోస్టుల భర్తీ కోసం ఇవాళ్టి నుంచి 27వ తేదీ వరకు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. 31,383 మంది అభ్యర్థులు హాజరుకాబోతున్న ఈ పరీక్షల కోసం హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలోని భారీ బందోబస్తు మధ్య 46 పరీక్ష కేంద్రాలను అధికారులు సిద్ధం చేశారు. అన్ని ఎగ్జామ్ సెంటర్ల వద్ద బీఎన్ ఎస్ఎస్ 163 సెక్షన్ విధించారు.


Similar News