రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. ఏప్రిల్ 13 నుంచి స్పెషల్ ట్రైన్స్
దిశ, తెలంగాణ బ్యూరో: సెలవుల సమయంలో ప్రయాణికుల రద్దీని తగ్గించడానికి వివిధ గమ్యస్థానాల
దిశ, తెలంగాణ బ్యూరో: సెలవుల సమయంలో ప్రయాణికుల రద్దీని తగ్గించడానికి వివిధ గమ్యస్థానాల మధ్య 19 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ మేరకు మంగళవారం దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్ 13 నుంచి 17 వరకు ఈ హాలిడే స్పెషల్ రైళ్లు నడుస్తాయని అధికారులు వెల్లడించారు. ఈ అన్ని రైళ్లలో ఏసీ టూ టైర్, ఏసీ త్రీ టైర్, స్లీపర్, జనరల్ క్లాస్ కోచ్‌లు ఉంటాయని పేర్కొన్నారు. హైదరాబాద్, నర్సాపూర్, కాచిగూడ, తిరుపతి, సికింద్రాబాద్, తిరుపతి, కాకినాడ టౌన్, బెర్హంపూర్, కాకినాడ, తిరుపతి, వికారాబాద్ రూట్‌లకు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు.