Oyo Hotel : ఓయో హోటల్ లో యువకుడి ఆత్మహత్యా యత్నం
హైదరాబాద్ రామాంతపూర్(Ramantapur)ప్రగతి నగర్ లోని ఓయో హోటల్ లో ఓ యువకుడి (youth)ఆత్మహత్యా యత్నం(Suicide attempt) కలకలం రేపింది.
దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్ రామాంతపూర్(Ramantapur)ప్రగతి నగర్ లోని ఓయో హోటల్ లో ఓ యువకుడి (youth)ఆత్మహత్యా యత్నం(Suicide attempt) కలకలం రేపింది. ఓంకార్ అనే యువకుడు ఓయో హోటల్(Oyo Hotel)లో ప్రియురాలు సౌమ్య తో కలిసి రూమ్ తీసుకున్నాడు. తెల్లవారుజామున ప్రేమ జంట మధ్య గొడవ చెలరేగిన నేపథ్యంలో మనస్తాపానికి గురైన ఓంకార్ ఆత్మహత్యా యత్నం చేసుకున్నాడు. యువతి బాత్ రూమ్‌కి వెళ్లిన సమయంతో ఓంకార్ ఆత్మహత్యాయత్నం చేశాడు. బాత్ రూమ్ నుంచి బయటకు వచ్చిన యువతి ఫ్యాన్‌కు ప్రియుడు ఓంకార్ ఉరేసుకుని ఉండడాన్ని చూసి భయాందోళనకు గురైంది. వెంటనే ఓయో హోటల్ సిబ్బందికి సమాచారం ఇచ్చింది. దీంతో అందరూ కలిసి యువకుడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఓంకార్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
హైదరాబాద్ బేగంబజార్‌కు చెందిన ఓంకార్ ప్రైవేట్ బ్యాంకు ఉద్యోగి. అతను, సౌమ్య అనే యువతి ఇద్దరూ కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వారిద్దరూ కలిసి రామంతపూర్ ప్రగతినగర్‌లో ఉన్న ర్లోని ఓయో రూమ్‌లో ఆదివారం రాత్రి అద్దెకు దిగారు. ప్రేమికుల మధ్య జరిగిన ఘర్షణతో ప్రియుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. వారిద్దరి మధ్య ఎందుకు గొడవ జరిగింది..ఓంకార్ ఎందుకు బలవన్మరణానికి పాల్పడ్డాడన్న విషయాలు తెలియాల్సి ఉంది. ఓయో హోటల్స్ లో తరుచు ఇలాంటి ఘటనలు వెలుగుచూస్తుండటంతో వాటి నిర్వహణ పట్ల అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.