అలాంటి వారికి కూడా బుద్ధి చెప్పాల్సిందే.. కేటీఆర్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్ వరుస ట్వీట్లతో విమర్శలు గుప్పిస్తున్నారు.

Update: 2023-03-22 05:44 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్ వరుస ట్వీట్లతో విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా బీజేపీ పాలిత రాష్ట్రంలో జరిగిన ఓ సంఘటనపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ మతాన్ని కించపరుస్తూ ట్వీట్ చేశాడన్న అభియోగాలపై కన్నడ యాక్టర్ చేతన్ కుమార్‌ను పోలీసులు అరెస్టు చేయడంపై కేటీఆర్ బుధవారం ట్విట్టర్ వేదికగా స్పందించారు.

‘బీజేపీ అధికారంలో ఉన్న కర్టాటకలో కించపరుస్తూ చేసిన ట్వీట్‌కు 14 రోజుల జైలు శిక్ష విధించారు. మరి మన తెలంగాణలో అంతకంటే దారుణంగా సీఎం, మంత్రులను, శాసనసభ్యులను ప్రత్యక్షంగా, ఘోరంగా అవమానిస్తున్నా సహిస్తునే ఉన్నాం. ఇక, అలాంటి వారికి మనం కూడా అదేవిధంగా బుద్ధి చెప్పాల్సి ఉంటుంది. భావవ్యక్తీకరణ హక్కు అనేది దుర్వినియోగం చేసే హక్కు కాదు. దీనిపై ప్రజలు మీరేమంటారు?’అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.

Tags:    

Similar News