దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా మహిళల్లో న్యూట్రిషన్ల లోపంతలెత్తుతున్నది. ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆరోగ్య మహిళా కార్యక్రమం ద్వారా చాలా మంది మహిళల్లో ఈ సమస్యలు బయట పడుతున్నాయి. ఇన్నాళ్లు ఈ సమస్య తమలో ఉన్నదా? అంటూ మహిళలు షాక్‌కు గురవుతున్నారు.ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఆరోగ్య మహిళ క్యాంపుల్లో ఇప్పటి వరకు 15,640 మంది మహిళల్లో రెటినాల్, విటమిన్‌బీ –1,2,3,5,6,7,9,12 తో పాటు విటమిన్సీ,డీ,ఈ,కే, కాల్షియం, క్రోమిమం, కాపర్, ప్లోరైడ్ ఐయోడిన్, ఐరన్, మెగ్నిషియం, మాంగసీస్, ఫాస్పరస్, పోటాషియం, సెలేనియం, సోడియం, జింక్వంటి న్యూట్రిషన్లు లోపం ఉన్నట్లు గుర్తించారు. వీరికి సంబంధిత డాక్టర్లు అవసరమైన మందులు, టానిక్లను అందించినట్లు ఆరోగ్య మహిళా క్యాంపు ఇంచార్టీ డాక్టర్లు చెబుతున్నారు.అత్యధికంగా ఖమ్మం, మెదక్, సంగారెడ్డి, సిద్ధిపేట్, నిజామాబాద్, యాదాద్రి తదితర జిల్లాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ అధికారిక నివేదికలు చెబుతున్నాయి.
ఎక్కువ మందికి బ్రెస్ట్, నోటి క్యాన్సర్ పరీక్షలు..
ఈ నెల 8 నుంచి ప్రారంభమైన ఆరోగ్య మహిళా స్కీమ్‌లో ఇప్పటి వరకు 54,872 మంది బ్రెస్ట్, నోటి క్యాన్సర్ల ప్రాథమిక పరీక్షలు నిర్వహించారు.అనుమానితులను ఎంఎన్‌జే ఆసుపత్రికి రిఫర్ చేశారు.దీంతో పాటు మూత్రకోశ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న 3,270 మందికి ఆసుపత్రులలో చికిత్స కొనసాగుతుందని డాక్టర్లు తెలిపారు.ఇక మహిళా క్యాంపులలో చెకప్‌లు తర్వాత 4,377 మందిని ఉస్మానియా, నిమ్స్, ఎంఎన్‌జే, గాంధీ వంటి ప్రధాన టీచింగ్ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు స్పష్టం చేశారు.
మహిళలు సద్వినియోగం చేసుకోవాలి.. మంత్రి హరీష్‌రావు
మహిళల సంపూర్ణ ఆరోగ్యం కోసం సీఎం కేసీఆర్ ఆలోచన మేరకు అమలు చేస్తున్న ‘ఆరోగ్య మహిళ’ను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. ఉమెన్ స్పెషల్ క్లినిక్స్‌కు ఆదరణ పెరుగుతున్నది. మహిళల సమ్రగ అరోగ్య పరిరక్షణ కోసం, మహిళలు ప్రధానంగా ఎదుర్కొంటున్న 8 రకాల ఆరోగ్య సమస్యలను గుర్తించి వైద్యం అందిస్తున్నాం. ఈ సేవలను మహిళలంతా వినియోగించుకోవాలి. సమస్య తీవ్రతను బట్టి పెద్దాసుపత్రులకు రిఫర్చేస్తున్నాం.