కాంగ్రెస్ టికెట్ దక్కలేదని బోరున ఏడ్చేసిన కీలక నేత.. పార్టీకి రాజీనామా

టీ కాంగ్రెస్ రెండో జాబితా ఆ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది.

Update: 2023-10-28 10:20 GMT

దిశ, వెబ్‌డెస్క్: టీ కాంగ్రెస్ రెండో జాబితా ఆ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. టికెట్ ఆశించి భంగపడ్డ నేతలందరూ తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. అనుచరులతో భవిష్యత్ కార్యాచరణపై చర్చలు జరుపుతోన్నారు. టికెట్ దక్కలేదనే ఆవేదనతో కొంతమంది పార్టీకి వరుసపెట్టి రాజీనామాలు చేస్తోన్నారు. దీంతో ఎన్నికల వేళ నేతల రాజీనామాలు కాంగ్రెస్‌లో ఆందోళన కల్గిస్తోన్నాయి. నేతలను బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నా పార్టీని వీడాలని నిర్ణయించుకుంటున్నారు.

తాజాగా వడ్డేపల్లి సుభాష్ రెడ్డి కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పారు. ఈ ఎన్నికల్లో ఎల్లారెడ్డి సీటును ఆయన ఆశించారు. కానీ రెండో జాబితాలో మదన్ మోహన్‌కు టికెట్ కేటాయించడంతో అసంతృప్తికి గురయ్యారు. శనివారం అనుచరులతో సమావేశమైన ఆయన.. భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా టికెట్ దక్కనందుకు కన్నీళ్లు పెట్టుకున్నారు. అనుచరుల ముందు బోరును ఏడ్చేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..