విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకోవాలి : RTC MD Sajjanar

విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు ఏర్పరచుకోవాలి.. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అన్నారు.

Update: 2023-07-02 12:55 GMT

దిశ, వెబ్‌డెస్క్: విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకోవాలి.. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అన్నారు. సికింద్రాబాద్‌లోని జీడిమెట్లలో ఎస్ఎస్‌కే సమాజ్ కమ్యూనిటీ హాల్‌లో రాష్ట్ర వ్యాప్తంగా క్షత్రియ ఖత్రి కులానికి చెందిన ఉత్తమ విద్యార్థిని, విద్యార్థులను ప్రోత్సహించడానికి ఇన్స్‌పిరేషన్ పొగ్రాం -2023 ద్వారా ఎస్ఎస్‌సీ, ఇంటర్, ఐఐటీ, ఎంబీబీఎస్ లలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఉత్తమ విద్యార్థులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సజ్జనార్ మాట్లాడుతూ.. క్షత్రియ విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు ఏర్పరచుకోవాలన్నారు.

పట్టుదల, క్రమశిక్షణ, ఉన్నత లక్ష్యం, కృషి ఉంటే ప్రతి విద్యార్థి ఉన్నత స్థానాలను చేరుకోవచ్చన్నారు. సభకు అధ్యక్షత వహించిన క్షత్రియ ప్రాంతీయ సమాజ్ అధ్యక్షులు ఆర్టీసీ ముఖ్య కార్యనిర్వహణ అధికారి విశ్వనాథ్ రవీందర్ మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి కష్టపడి చదివి ఐఏఎస్, ఐపీఎస్ లక్ష్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. అలాగే ప్రాంతీయ సమాజ్ సలహాదారులు, అఖిల భారత క్షత్రియ సమాజ్ ఉపాధ్యక్షులు విశ్వనాథ్ బాలకిషన్ మాట్లాడుతూ.. తల్లిదండ్రులు విద్యార్థులను ఉన్నత చదువులకు ప్రోత్సహించాలన్నారు. వివిధ ప్రాంతాల నుంచి హజరైన క్షత్రియ కమ్యూనిటీలోని ఉత్తమ విద్యార్థిని, విద్యార్థులకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా ఘన సన్మానం చేశారు. కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.

ఈ కార్యక్రమంలో క్షత్రియ సమాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టంకు విష్ణు, కార్యక్రమ కన్వీనర్ సిరిగిరి రాంకిషన్ రావు, ఉపాధ్యాక్షులు డాక్టర్ విశ్వనాథ్ అశోక్, పుజారి రాజేశ్వర్, మామిడి పెంటూసా, గుజరాతి రాజేశ్వర్, కోశాధికారి దినేష్ వైద్య, రాష్ట్ర కార్య నిర్వహణ కార్యదర్శి ఖాందేశ్ శ్రీనివాస్, అనిత, క్షత్రియ ప్రాంతీయ యువ సమాజ్ రాష్ట్ర అధ్యక్షుడు శివ పండిత్, ప్రధాన కార్యదర్శి జమన్ జ్యోతి శ్రావణ్, కోశాధికారి విజయ్ బసుదే తదితరులు పాల్గొన్నారు.


Similar News