CM సభలో విద్యార్థులే వాలంటీర్లు.. స్టూడెంట్స్‌తో జనాలకు సభలో నీళ్లు, కూర్చీలు
జగిత్యాల సీఎం కేసీఆర్ సభలో జరిగిన ఓ ఘటన వివాదాస్పదంగా మారింది. సీఎం సభ కోసం ఏకంగా విద్యార్థులనే వాలంటీర్లుగా ఉపయోగించుకున్నారు టీఆర్ఎస్ నేతలు.
దిశ, డైనమిక్ బ్యూరో: జగిత్యాల సీఎం కేసీఆర్ సభలో జరిగిన ఓ ఘటన వివాదాస్పదంగా మారింది. సీఎం సభ కోసం ఏకంగా విద్యార్థులనే వాలంటీర్లుగా ఉపయోగించుకున్నారు టీఆర్ఎస్ నేతలు. స్టూడెంట్స్‌తో సభకు వచ్చిన వారికి నీళ్లు అందించడం, వారికి కూర్చీలు వేయడం, సభకు వచ్చిన ప్రజల మధ్యలో ఎండలో నిలబడి సేవలు చేసిన వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.
వివరాల్లోకి వెళితే..బుధవారం జరిగిన సీఎం కేసీఆర్ సభలో గురుకుల విద్యర్థులు వాలంటీర్లుగా వ్యవహరించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇప్పటికే సీఎం కేసీఆర్ సభకు వస్తే రూ.200 ఇచ్చినట్లు సభకు వెళ్లిన పలువురు వ్యక్తులు చెప్పినటువంటి వీడియోలు నెట్టింట చక్కర్లుకొడుతుండగా..తాజాగా గురుకుల విద్యార్థుల వీడియోలు, ఫోటోలు వైరల్‌గా మారాయి.
సీఎం కేసీఆర్ సభలో వాలంటీర్లుగా గురుకుల విద్యార్థులు కనిపించారు. సభకు వచ్చిన జనాలకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ నుంచి రప్పించారు టీఆర్ఎస్ స్థానిక లీడర్లు. ఉదయం హాస్టల్ దగ్గరకు వచ్చిన టీఆర్ఎస్ లీడర్లు తమని సభ రావాలని ఆదేశించినట్లు విద్యార్థులు చెబుతున్నారు. అంతే కాకుండా, వాలంటీర్‌లుగా వచ్చిన విద్యార్థులకు నేతలు గులాబీ టీషర్ట్స్ వేయించి తీసుకొచ్చారు.
సభలో జనాలకు నీళ్లు, కూర్చీలు వేయాలని ఆదేశించారు. సీఎం సభ ముగిసే వరకు విద్యార్థులు ఎండలో నిల్చుని ఉన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను బీజేపీ నేతలు ట్వీట్ చేస్తూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులతో సీఎం సభలో సేవలు చేయించుకోవడం ఏంటని మండిపడుతున్నారు. కనీసం వారి కోసం కుర్చీలు కూడా వేయకుండా, కిందే కూర్చోబెట్టిన ఫోటోలు కూడా ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
Also Read....