టీచర్ కొట్టిందని పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన బుడ్డోడు (వీడియో)

దిశ, బయ్యారం: తెలంగాణలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు అవుతోందని ప్రభుత్వం చెబుతూ ఉంటుంది. ఆపదలో ఉన్నామని ఎవరొచ్చినా వెంటనే స్పందిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు.

Update: 2022-03-05 11:33 GMT

దిశ, బయ్యారం: తెలంగాణలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు అవుతోందని ప్రభుత్వం చెబుతూ ఉంటుంది. ఆపదలో ఉన్నామని ఎవరొచ్చినా వెంటనే స్పందిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. దీంతో చిన్నా, పెద్దా తేడా లేకుండా పోలీస్ స్టేషన్లకు వస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ క్రమంలో ఓ బుడ్డోడు సమస్య పరిష్కారం కోసం పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడం కలకలం రేపింది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలో చోటుచేసుకుంది.

మండల కేంద్రానికి చెందిన అనిల్ అనే బుడ్డోడు ఓ ప్రైవేటు స్కూల్‌లో 2వ తరగతి చదువుతున్నాడు. అయితే, అనిల్‌ను రోజూ టీచర్ కొడుతుండటంతో పోలీసులకు చెప్పేందుకు స్టేషన్‌కు వచ్చి ఎస్ఐ రమాదేవి దగ్గర మొర పెట్టుకున్నాడు. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. వీడియోలో బుడ్డోడు మాటలకు అందరూ ఫిదా కావడంతో నెట్టింట వైరల్‌గా మారింది. వీడియోలో ''తాప తాపకు కొడుతుండు మేడం. నేను మెడిటేషన్ చేస్తాంటే కొడుతుండు.. ఎవ్వరకీ కొడుతలేడు. నామీద కక్షపెట్టుకొని కొడుతుండు. ఆయన మీద కేసు పెట్టాలంటూ '' మాట్లాడాడు. బుడ్డోడి ధైర్యానికి ఫిదా అయిన పోలీసులు.. విచారణ చేపడతానంటూ హామీ ఇచ్చారు.

చీర కట్టుకున్నందుకే ఆ క్రికెటర్లు అవమానించారు.. స్టార్ నటి

Tags:    

Similar News

టైగర్స్ @ 42..