మల్లారెడ్డి కాలేజీ ఎదుట బైఠాయించిన విద్యార్థులు
బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి మల్లారెడ్డికి చెందిన యూనివర్సిటీ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. గురువారం కాలేజీలో అరుణ్ అనే విద్యార్థి స్పృహతప్పి పడిపోయాడు.
దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి మల్లారెడ్డికి చెందిన యూనివర్సిటీ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. గురువారం కాలేజీలో అరుణ్ అనే విద్యార్థి స్పృహతప్పి పడిపోయాడు. కాలేజీ యాజమాన్యంతో పాటు ఉపాధ్యాయులు కూడా వెంటనే స్పందించకపోవడం, సరైన సమయంలో వైద్యం అందక పరిస్థితి విషమించి విద్యార్థి మృతిచెందారు. అంబులెన్స్ కూడా 20 నిమిషాలు ఆలస్యంగా రావడంతో అప్పటికే విద్యార్థి కన్నుమూశారు. దీంతో యాజమాన్యం తీరుపై ఆగ్రహించిన విద్యార్థులు.. కాలేజీ ఎదుట బైఠాయించారు. మల్లారెడ్డికి, యాజమాన్యానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. విద్యార్థి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు.