రాష్ట్రంలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం ఖాయం.. మంత్రి మల్లారెడ్డి
రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం సాధించడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్ లో బుధవారం నిర్వహించిన పార్టీ విస్తృతస్థాయి సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కర్ణాటకలో గెలిచినంత మాత్రాన రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుస్తుదనడంలో ఏమాత్రం నిజం లేదన్నారు. కర్ణాటకలో ఉన్న పరిస్థితులు రాష్ట్రంలో లేవన్న మంత్రి.. అక్కడ కాంగ్రెస్ కు ప్రత్యమ్నాయం లేదన్నారు.
అక్కడి ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి చేయకపోవడం వల్లే కాంగ్రెస్ గెలిచిందన్న మల్లారెడ్డి.. కానీ రాష్ట్రంలో తమ ప్రభుత్వం చేపట్టిన పథకాలే తమను గెలిపిస్తాయని చెప్పారు. 100కు పైగా సీట్లలో గెలిచి కేసీఆర్ మూడోసారి సీఎం అవుతారని మంత్రి మల్లారెడ్డి స్పష్టం చేశారు.