టీచర్ల బదిలీలు, ప్రమోషన్లపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్‌లు కొనసాగేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోర్టును కౌంటర్ అఫిడవిట్‌లో ప్రభుత్వం కొరనునున్నది.
దిశ, తెలంగాణ బ్యూరో: ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్‌లు కొనసాగేలా ఉత్తర్వులు ఇవ్వాలని హై కోర్టును కౌంటర్ అఫిడవిట్‌లో ప్రభుత్వం కొరనునున్నది. బదిలీల నిబంధనలపై నాన్ స్పౌజ్ టీచర్ల అసోసియేషన్ పిటిషన్ వేయగా, నిబంధనలు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని పిటిషనర్ల వాదనలు కోర్టు విని ఈ కేసును ఈ నెల 14 కి వాయిదా వేసింది. నిబంధనలపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి కోర్టు ఆదేశించింది.
ఆ నిబంధనల్లో ఎలాంటి మార్పులు చేయడానికైనా సిద్దమని కోర్టుకు ప్రభుత్వం చెప్పనున్నట్లు అధికారులు తెలిపారు. బదిలీల కోసం 75 వేల మంది టీచర్‌లు దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్‌లు కొనసాగేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోర్టును కౌంటర్ అఫిడవిట్‌లో ప్రభుత్వం కోరనుంది.