మూసీ ప్రక్షాళనకు మరో టెండర్.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం..

హైదరాబాద్ నగరంలో ఉన్న మూసీ( Musi) నదిని ప్రక్షాళన చేసి.. నగర ప్రజలకు మంచి నీటిని అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Update: 2024-11-07 06:16 GMT

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ నగరంలో ఉన్న మూసీ( Musi) నదిని ప్రక్షాళన చేసి.. నగర ప్రజలకు మంచి నీటిని అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఇప్పటికే మూసీ సుందరీకరణ(Musi beautification) పేరుతో సర్వేలు నిర్వహించిన ప్రభుత్వం, తాజాగా మూసీ ప్రక్షాళన పై దృష్టి సారించింది. ఈ క్రమంలో మల్లన్నసాగర్(Mallannasagar) నుంచి నీటిని మళ్లించేందుకు పురపాలక శాఖ అనుమతి ఇచ్చింది. దీనికి సంబంధించిన మొత్తం రూ. 5,560 కోట్లతో కూడిన టెండర్ నోటీసులు త్వరలో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా హిమాయత్ సాగర్, గండిపేటలోని ఉస్మాన్ సాగర్ వద్ద ప్రభుత్వం నీటి శుద్ధీకరణ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.


Similar News