Yadagirigutta : యాదగిరిగుట్ట ఆలయంలో మరమ్మతులు

యాదగిరిగుట్ట (‘Yadagirigutta) శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో లీకేజీలకు, రాళ్లు కుంగిన ప్రాంతాల్లోనూ వైటీడీఏ అధికారులు మరమ్మతు(Repairs) చర్యలు చేపట్టారు.

Update: 2024-11-07 07:52 GMT

దిశ, వెబ్ డెస్క్ : యాదగిరిగుట్ట (‘Yadagirigutta) శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో లీకేజీలకు, రాళ్లు కుంగిన ప్రాంతాల్లోనూ వైటీడీఏ అధికారులు మరమ్మతు(Repairs) చర్యలు చేపట్టారు. దక్షిణ రాజగోపురం ప్రాకార మండపం వెంట మాడవీధుల్లో 50 మీటర్ల పొడవున మూడు ఇంచుల మేరకు కుంగిన ప్రాంతానికి మరమ్మతులు చేపట్టారు. మాఢ వీధులను శుభ్రం చేసి కుంగిన ప్రాంతాలను మార్కింగ్ చేసి మరమ్మతులు జరిపిస్తున్నారు. రిటైనింగ్ వాల్ దెబ్బతినకుండా అవసరమైన చర్యలు తీసుకోనున్నారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2016లో యాదగిరి గుట్ట ప్రధాన ఆలయం పునర్ నిర్మాణాన్ని 1300కోట్లతో చేపట్టింది. 1.20ఎకరాల్లో ఉన్న కొండపైన ప్రధాన ఆలయాన్ని 4.20ఎకరాలకు విస్తరించే క్రమంలో కొండను చదును చేసి రిటైనింగ్ వాల్స్ నిర్మి్ంచి, సప్త రాజగోపురాలతో ఆలయాన్ని పునరుద్ధరించారు. 2022లో కురిసిన వర్షాలకు ప్రధానాలయంలో పలుచోట్ల ప్రాకార మండపాల్లో లీకేజీలు వెలుగుచూశాయి. ఘాట్ రోడ్డు అనుబంధ రోడ్లు కొట్టుకపోయాయి. సిమెంట్, రసాయన మిశ్రమాలతో మరమ్మతులు చేపట్టారు. అయినప్పటికి తరుచుగా ఆలయ నిర్మాణ పనుల్లో లోపాలు బయటపడుతునే ఉన్నాయి. 

Tags:    

Similar News