టెన్త్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. సప్లిమెంటరీ పరీక్షలు షెడ్యూల్ రిలీజ్

ఎస్ఎస్‌సీ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 3 నుండి 13 వరకు నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ సోమవారం ఒక

Update: 2024-05-27 17:10 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఎస్ఎస్‌సీ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 3 నుండి 13 వరకు నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షల్లో మొత్తం 51,237 మంది విద్యార్థులు హాజరవుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఇందులో 31,625 మంది బాలురు కాగా, 19612 మంది బాలికలు పరీక్షలు రాస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 170 పరీక్ష కేంద్రాలలో పరీక్ష నిర్వహణకు 170 మంది చీఫ్ సూపరిండెంట్ 170 డిపార్ట్మెంట్ అధికారులు, 1300 మంది ఇన్విజిలేటర్లు విధులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే 30 మంది ప్లయింగ్ స్క్వాడ్ టీం పర్యవేక్షిస్తారని తెలిపారు. విద్యార్థులు తమ హాల్ టిక్కెట్లను www.bse .telangana.gov.in నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. ఏవైనా సమస్యలు ఉంటే కంట్రోల్ రూమ్‌కు ఫోన్ నెంబర్ 040 23230942కు కాల్ చేయాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. పరీక్ష కేంద్రానికి ఒక గంట ముందు చేరుకోవాలని సూచించారు.


Similar News