Raj Pakala: లాయర్‌తో కలిసి విచారణకు హాజరైన రాజ్‌ పాకాల

జన్వాడ ఫామ్‌హౌస్‌ రేవ్ పార్టీ కేసుకు సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బావమరిది రాజ్‌ పాకాలపై కేసు నమోదైన విషయం తెలిసిందే.

Update: 2024-10-30 08:10 GMT

దిశ, వెబ్‌డెస్క్: జన్వాడ ఫామ్‌హౌస్‌ రేవ్ పార్టీ (Janwada Rave Party) కేసుకు సంబంధించి బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) బావమరిది రాజ్‌ పాకాల (Raj Pakala)పై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ రోజు (బుధవారం) మోకిల పోలీసుల ఎదుట విచారణకు రాజ్‌ పాకాల హాజరయ్యారు. తన లాయర్‌తో కలిసి పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. ఇక రేవ్ పార్టీ కేసులో రాజ్‌ పాకాలకు ఆదివారం మోకిలా పోలీసులు (Mokila Police) నోటీసులు జారీ చేసి పార్టీ కేసుకు సంబంధించి విచారించాల్సి ఉందని అందులో పేర్కొన్నారు. అయితే ఈ నోటీసులను సవాల్ చేస్తూ కోర్టుకెక్కిన రాజ్ పాకాల.. తనకు రెండు రోజుల సమయం కోరారు. దానికి కోర్టు అంగీకరించడంతో నేడు రెండు రోజుల తర్వాత ఆయన పోలీసుల ఎదుట హాజరయ్యారు.


Similar News