Srisailam: శ్రీశైలానికి కొనసాగుతున్న భారీ వరద

శ్రీశైలం ఎగువన ఉన్న తుంగభద్ర, సుంకేసుల, జూరాల జలాశయానికి భారీ వరద వస్తుంది.

Update: 2024-08-04 04:22 GMT

దిశ, వెబ్ డెస్క్: శ్రీశైలం ఎగువన ఉన్న తుంగభద్ర, సుంకేసుల, జూరాల జలాశయానికి భారీ వరద వస్తుంది. దీంతో మూడు ప్రాజెక్టులకు వచ్చిన వరదను వచ్చినట్లే దిగువన శ్రీశైలం జలాశయానికి వదులుతున్నారు. దీంతో ఇప్పటికే నిండుకుండలా ఉన్న శ్రీశైలం జలాశయం నుంచి కూడా వచ్చిన నీటిని వచ్చినట్లే సాగర్ కు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలానికి 4,50,064 క్యూసెక్కులు ఇన్ఫ్లో వస్తుండగా.. 5,22,318 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 882.20 అడుగులు.. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 200.1971 టీఎంసీల నిల్వ ఉంది. కాగా ప్రస్తుతం శ్రీశైలం డ్యాం 10 గేట్లను 20 అడుగుల మేర ఎత్తి నీటిని విడుదల చేస్తుండగా.. సందర్శకుల తాకిడి తో భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. గంటకు ఒక్క కిలో మీటర్ కూడా వాహనాలు కదలడం లేదు. దీంతో పోలీసులు అప్రమత్తమై.. సందర్శకులను సమయం చూసుకుని రావాలని.. వీకెండ్స్ కావడంతో భారీ ట్రాఫిక్ జామ్ ఉందని.. జలాశయానికి వస్తున్న వరద దృష్ట్యా.. మరో వారం రోజుల పాటు గేట్లను తీసే ఉంచుతారని అధికారులు సూచిస్తున్నారు.

Tags:    

Similar News