Srisailam: శ్రీశైలం వెళ్తున్న మల్లన్న భక్తులకు శుభవార్త.. టీఎస్ ఆర్టీసీ బంపర్ ఆఫర్

మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీశైల బ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలకు వెళ్తున్న భక్తులకు టీఎస్ ఆర్టీసీ శుభవార్త చెప్పింది.

Update: 2024-03-01 05:02 GMT

దిశ, వెబ్‌డెస్క్: మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీశైల బ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలకు వెళ్తున్న భక్తులకు టీఎస్ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి వారిని దర్శించుకునేందుకు రాష్ట్రం నుంచి భక్తులు శ్రీశైలానికి పెద్ద సంఖ్యలో వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో టీఎస్ ఆర్టీసీ హైదరాబాద్ నుంచి శ్రీశైలానికి ప్రత్యేక బస్సులు నడనున్నట్లు రంగారెడ్డి రీజియన్‌ రీజనల్ మేనేజర్ శ్రీధర్‌ ప్రకటించారు. ఈ బస్సులను నగరంలోని బీహెచ్‌ఈఎల్‌, జూబ్లీ స్టేషన్‌, ఎంజీబీఎస్‌ నుంచి శ్రీశైలం బస్సులు ఉదయం 5 గంటల నుంచి మొదలై మధ్యాహ్నం మూడు గంటల వరకు ప్రతి గంటకు ఓ బస్సును నడుపుతున్నామని పేర్కొన్నారు.

అదేవిధంగా శ్రీశైలం దేవస్థానం నుంచి ఉదయం 5 గంటల నుంచి బస్సు సర్వీసులను హైదరాబాద్‌కు బస్సులు బయలుదేరుతాయని పేర్కొన్నారు. ముఖ్యంగా నగరం నుంచి ఉదయం 6 గంటలకు, మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ప్రతి గంటకు బస్సులు బయల్దేరతాయని వెల్లడించారు. భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఏసీ, ఆర్డీనరీ, సూపర్‌ లగ్జరీ బస్సులను నడుపుతున్నట్లు తెలిపారు. ఏసీ బస్సు సర్వీసుల్లో పెద్దలకు రూ.650, పిల్లలకు రూ.510 ఛార్జీలుగా నిర్ణయించామని రంగారెడ్డి రిజియన్ మేనేజర్ శ్రీధర్ పేర్కొన్నారు.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..