కిషన్ రెడ్డి పునరాలోచన చేయాలి.. మంత్రి శ్రీధర్ బాబు డిమాండ్

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-06-20 09:55 GMT

దిశ, డైనమిక్ బ్యూరో/ తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని కొత్త గనులను ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తామని చెప్పడం సరికాదని, ఈ విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పునరాలోచన చేయాలని మంత్రీ శ్రీధర్ బాబు అన్నారు. ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ పరం చేయాలనే చర్యలు మంచివి కాదని, రాష్ట్రంలోని బొగ్గు, ఇతర ఖనిజ నిక్షేపాలను ప్రభుత్వ రంగ సంస్థల ద్వారానే ఉత్పత్తి చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం సింగరేణి సంస్థ లాభాల్లో నడుస్తోందని, కార్మికులు, అధికారుల నైపుణ్యం వల్ల ప్రస్తుతం కంపెనీ బలంగా ఉందన్నారు. ప్రతి సంవత్సరం బొగ్గు ఉత్పత్తి పెరుగుతూ వస్తోందని చెప్పారు. ఓవైపు సింగరేణిని ప్రైవేటుపరం చేయమంటూనే మరోవైపు ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్రం ప్రయత్నం చేస్తోందని ఇది కేంద్రంలోని బీజేపీ సర్కార్ ద్వంద్వనీతి అని విమర్శించారు. త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీనితో భేటీ అయి రాష్ట్ర సమస్యలను పీఎం దృష్టికి తీసుకువెళ్లి కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తామన్నారు. గనుల వేలం విషయంలో ప్రభుత్వ ఆలోచనను సింగరేణి సంస్థ దృష్టికి తీసుకువెళ్లామన్నారు. సింగరేణి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినదన్నారు. ఒక వేళ వేలంలో పాల్గొనాలని సింగరేణి భావిస్తే అప్పుడు తాము మాట్లాడుతామన్నారు.

బీఆర్ఎస్ అలా చేస్తే వచ్చే ఎన్నికల్లో కనీసం ఒక్కసీటైనే గెలిచే ఛాన్స్:

అధికారంలో ఉండగా బీఆర్ఎస్ తీసుకున్న వారు తీసుకున్న నిర్ణయాలను పునరాలోచన చేసుకుంటే రాబోయే లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు కనీసం ఒక్క సీటైనా దక్కే అవకాశం ఉందని ఎద్దేవా చేశారు. మళ్లీ పాతపద్దతిలోనే బీఆర్ఎస్ మాట్లాడం సరికాదన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో రేవంత్ రెడ్డి సీరియస్ గా ఉన్నారని శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. శాంతిభద్రతలకు ఎవరు విఘాతం కలిగించినా సహించేది లేదని అలాంటి వారిపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. తెలంగాణ ప్రజలు ఓట్లు వేస్తే మేము గెలిచామని వారి సంక్షేమం కోసం తమ పాలన సాగుతుంది తప్ప ఆంధ్రప్రదేశ్ ను చూసి నేర్చుకోవాల్సిన అవసరం తమకు లేదన్నారు. బీఆర్ఎస్ టీడీపీని ఫాలో అవుతోందని విమర్శించారు. బీఆర్ఎస్ అడ్డగోలు నిర్ణయాలు తాము తీసుకోబోమన్నారు.

త్వరలో జాబ్ క్యాలెండర్:

త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తారని శ్రీధర్ బాబు తెలిపారు. జోవో 46 పై త్వరలోనే సబ్ కమిటీ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. గ్రూప్ -2, గ్రూప్-3 పోస్టులు పెంచాలని, మరికొన్ని కారణాలతో కొంతమంది ఇవాళ ధర్నా చేస్తున్నారు. కానీ గతంలో ఇచ్చిన నోటీఫికేషన్ల ద్వారా ఐదున్నర లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పాత నోటిఫికేషన్ రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ ఇస్తే ఎటువంటి లీగల్ ఇష్యూసులు వస్తాయి. అవి రాకూడదనే జాగ్రత్తలు వహిస్తూ పాత నోటిఫికేషన్ ప్రకారమే గ్రూప్2, గ్రూప్-3 పరీక్షల నిర్వహణకు సిద్ధమయ్యామన్నారు. కొత్తగా ఏర్పడబోయే ఖాళీలను గుర్తించి వాటిని భర్తీ చేసే కార్యక్రమం అతి త్వరలోనే జరుగుతుందన్నారు.

సీబీఐ విచారణ జరిపించండి:

పరీక్షల నిర్వహణలో ప్రధాని నరేంద్ర మోడీ విఫలం అయ్యారని, నీట్ పరీక్ష అవకతవకలపై సీబీఐ ఎంక్వైరీ చేయాలని శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు. నీట్ విద్యార్థులకు న్యాయం చేయాలన్నారు. పోటీ పరీక్షల నిర్వహణలో ముఖ్యంగా వైద్య విద్యాలో అన్ని రాష్ట్రాల్లో ఆందోళనలు జరుగుతున్నాయ్నారు. జూన్ 14న రావాల్సిన నీట్ ఫలితాలు జూన్ 4నే విడుదల చేయడం, గ్రేస్ మార్కులను కలపడంపై అనుమానానలు ఉన్నాయన్నారు.

Tags:    

Similar News