కర్ణాటక ఇన్‌చార్జీగా శ్రీధర్‌బాబు సక్సెస్
కర్ణాటక కాంగ్రెస్ విజయంలో ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సక్సెస్అయ్యారు. ఏఐసీసీ ఇన్‌చార్జీ హోదాలో పార్టీని యాక్టీవ్ చేయడంలో కీ రోల్ పోషించారు.
దిశ, తెలంగాణ బ్యూరో: కర్ణాటక కాంగ్రెస్ విజయంలో ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సక్సెస్అయ్యారు. ఏఐసీసీ ఇన్‌చార్జీ హోదాలో పార్టీని యాక్టీవ్ చేయడంలో కీ రోల్ పోషించారు. కాంగ్రెస్‌లోనే ఉద్దండ నాయకులైన మల్లిఖార్జున ఖర్గే, సిద్ధ రామయ్య, డీకే శివకుమార్ లాంటి సొంత రాష్ట్రంలో ఈ ముగ్గురి టీమ్‌లను కలుపుకొని వెళ్తూ పార్టీ విజయానికి కృషి చేశారు. ఇది పెద్ద టాస్కే అయినప్పటికీ శ్రీధర్‌బాబు ప్రత్యేక చొరవతో అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చినట్లు ఆ పార్టీలో చర్చ జరుగుతున్నది. ముగ్గురు నాయకులను ఏకతాటి పైకి తీసుకొచ్చి కర్ణాటక విజయంలో తనవంతు పాత్రను పోషించారు.
అభ్యర్థుల సెలక్షన్ల నుంచి టిక్కెట్లు పంపిణీ, ప్రచారాల్లో సమన్వయం వంటివన్నీ శ్రీధర్‌బాబు దగ్గరుండి మానిటరింగ్ చేశారు. ఇక స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులను, బూత్ స్థాయి కమిటీలను కలుపుకొని వెళ్లి కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులైన సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీల సభలను సక్సెస్ చెయ్యడంలో తన వంతు పాత్రను పోషించాడు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడా? అంటూ విమర్శించే ప్రతిపక్ష పార్టీల నాయకుల నోర్లన్నీ మూతపడేలా కాంగ్రెస్ కర్ణాటక ఫలితాలు సాధించడంలో తన పాత్రకు నూటికి నూరు పాళ్ళు న్యాయం చేశాడని ఆ పార్టీలో అభినందనలు మొదలయ్యాయి.