రెండేళ్లుగా అక్రమ బిల్లులతో దేవుడి సొమ్ముకు కన్నం

దేవుడిపై భక్తుల విశ్వాసాన్ని కరీంనగర్‌లో ఓ ఆలయ కార్యనిర్వహణ అధికారి సొమ్ము చేసుకుంటున్నాడు.

Update: 2024-06-26 03:09 GMT

కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రి ఎదురుగా కోలువైన ప్రసన్నాంజనేయస్వామి దేవాలయం నగరంలో ప్రసిద్ధి గాంచింది. ఇక్కడ నిత్యం వందల సంఖ్యలో భక్తులు స్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటారు. ఇక్కడ ముడుపు చెల్లించామంటే ఎంతటి కష్టాల్లో ఉన్నా సునాయాసంగా కాపాడుతాడని భక్తుల విశ్వాసం. అయితే దేవుడిపై భక్తులకు ఉన్న ఈ విశ్వాసాన్ని ఆ ఆలయ కార్యనిర్వహణ అధికారి సొమ్ము చేసుకుంటున్నాడు. దేవుడి మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు ఇచ్చిన విరాళాలకు దొంగ బిల్లులు పెట్టి దేవుడికే శఠగోపం పెడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వేడుక ఏదైనా నిధులు లేవంటూ సెంటిమెంటుతో భక్తులకు మొక్కులు చెల్లించుకోండి మోక్షం కలుగుతుందని కళ్లబొల్లి మాటలతో భక్తులను బోల్తా కోట్టిస్తూ అక్రమాలకు తెరలేపుతున్నాడు. రెండేళ్లుగా అక్రమార్జనకు అలవాటుపడిన ఆ అధికారి అడుగడుగునా భక్తుల విశ్వాసాన్ని సొమ్ము చేసుకుంటూ ప్రసన్నాంజనేయస్వామి నిధులు మింగేస్తున్నాడు.

దిశ బ్యూరో, కరీంనగర్: దేవుడిపై భక్తుల విశ్వాసాన్ని కరీంనగర్‌లో ఓ ఆలయ కార్యనిర్వహణ అధికారి సొమ్ము చేసుకుంటున్నాడు. దేవుడి మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు ఇచ్చిన విరాళాలకు దొంగ బిల్లులు పెట్టి దేవుడికే శఠగోపం పెడుతున్నాడు. వేడుక ఏదైనా నిధులు లేవంటూ సెంటిమెంటుతో భక్తులకు మొక్కులు చెల్లించుకోండి మోక్షం కలుగుతుందని కళ్లబొల్లి మాటలతో భక్తులను బోల్తా కోట్టిస్తూ అక్రమాలకు తెరలేపుతున్నాడు. రెండేళ్లుగా అక్రమార్జనకు అలవాటు పడిన ఆ అధికారి అడుగడుగునా భక్తుల విశ్వాసాన్ని సొమ్ము చేసుకుంటూ ప్రసన్నాంజనేయస్వామి నిధులు మింగేస్తున్నాడు.

వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రి ఎదురుగా కోలువైన ప్రసన్నాంజనేయస్వామి దేవాలయం నగరంలో ప్రసిద్ధి గాంచిన దేవాలయాల్లో మొదటివరుసలో ఉంటుంది. ఇక్కడ నిత్యం వందల సంఖ్యలో భక్తులు స్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటారు. ఇక్కడ ముడుపు చెల్లించామంటే ఎంతటి కష్టాల్లో ఉన్నా సునాయాసంగా కాపాడుతాడని భక్తుల విశ్వాసం. నిత్యం ఇక్కడికి వచ్చే భక్తులు కానుకల రూపంలో ఇచ్చి దేవుడి అనుగ్రహం పొందాలని ప్రతి వేడుకను కన్నుల పండువగా జరిపేందుకు భక్తులు ఎగబడుతుంటారు. అయితే ఆ భక్తుల విశ్వాసాన్ని ఆ ఆలయకార్యనిర్వహణ అధికారి సొమ్ము చేసుకుంటున్నాడు.

తాజాగా గత నెలలో జరిగిన శ్రీరామనవమి, హనుమాన్ జయంతి వేడుకలకు రూపాయి ఖర్చుపెట్టకుండానే భక్తులు తమ స్వహస్తాలతో నిర్వహించిన వేడుకలకు తాను ఖర్చుపెట్టినట్టు దొంగ బిల్లులు సృష్టించి దేవుడి సొమ్ము స్వాహా చేశాడు. శ్రీరామనవమి, హనుమాన్ జయంతి వేడుకల సందర్భంగా భక్తులు టెంట్లు వేసి గ్రీన్ మ్యాట్ పరిచి పెళ్లి పందిరి, పూజ సామగ్రి సమకూర్చి డీజే సౌండ్లతో అత్యంత వైభవంగా నిర్వహించి అన్నదానం చేశారు. కాగా ఆ వేడుక అంత ఆలయ నిధులతో చేసినట్టుగా బిల్లులు తీసుకోవడంతో సదరు ఈవో బండారం బహిర్గతం అయింది. అయితే గుట్టుచప్పుడు కాకుండా ప్రతియేటా భక్తులు నిర్వహించే ప్రతి వేడుకకు ఇలాగే దొంగ బిల్లులు సృష్టించి దేవుడి సొమ్మును స్వాహా చేస్తున్నాడని సాక్షాత్తు అక్కడి పురోహితులు వచ్చిన భక్తులకు చెప్పడం అక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది. అంటే సదరు అధికారి అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్థం అవుతుంది.

అంతే కాకుండా రేపటి నుంచి మూడు రోజుల పాటు జరిగే సుందరాకాండ పారాయణం ఏర్పాట్ల కోసం గుడి పూజారులు ఏర్పాట్లు చేయాలని కోరగా టెంపుల్లో నిధులు లేవంటూ మీరే భక్తుల నుంచి విరాళాలు సేకరించి చేయాలని ఖరాకండిగా చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో మనసు నొచ్చుకున్న పూజారులు అక్కడికి వచ్చిన భక్తులతో అక్కసు వెల్లగక్కుతూ అతగాడి బండారం కుండబద్దలు కొట్టినట్టు చెప్తున్నారు. ఇంత జరిగినా నేనే పాపం ఎరుగనంటూ ఈఓ చెప్పడం కోసం మెరుపు. గిట్టని వారు చేస్తున్న ప్రచారం నేను ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదు. అక్రమ బిల్లులు ఎక్కడా తీసుకోలేదు. నేనంటే గిట్టని వారు కొందరు నాపై కావాలని అసత్యప్రచారాలు చేస్తున్నారని ఆలయ ఈవో నాగారపు శ్రీనివాస్ అన్నారు. 


Similar News