కేటీఆర్‌తో శ్రీలంక మంత్రి భేటీ.. బీఆర్ఎస్ పాలనపై ప్రశంసలు
తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ తో శ్రీలంక మంత్రి సతాశివన్ వియలందేరన్ భేటీ అయ్యారు.
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ తో శ్రీలంక మంత్రి సతాశివన్ వియలందేరన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా.. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో సాధించిన ప్రగతి గురించి.. గతంలో శ్రీలంక పార్లమెంట్లో ప్రస్తావించినట్లు గుర్తు చేశారు. అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వం పాలనలో హైదరాబాద్ నగరం అభివృద్ధి సింగపూర్‌ను తలపించేలా జరిగిందని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే తెలంగాణను పెట్టుబడులకు కేరాఫ్ అడ్రస్‌గా మార్చారని, ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగ సమస్య పెరుగుతుంటే.. తెలంగాణ రాష్ట్రంలో అవకాశాల అక్షయపాత్రగా మార్చిన తీరు స్ఫూర్తిదాయకం అని శ్రీలంక మంత్రి సతాశివన్ వియలందేరన్ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు చెప్పుకొచ్చారు.