తెలంగాణలో శ్రీచైతన్య, నారాయణ కాలేజీలను నిషేధించాలి: VJS డిమాండ్

విద్యార్థుల ఆత్మహత్యలకు కేంద్రాలైన ఆంధ్ర విద్యాసంస్థలు శ్రీ చైతన్య, నారాయణ కాలేజీలను తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం నిషేధించాలని విద్యార్థి జనసమితి డిమాండ్ చేసింది.

Update: 2023-03-01 13:33 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: విద్యార్థుల ఆత్మహత్యలకు కేంద్రాలైన ఆంధ్ర విద్యాసంస్థలు శ్రీ చైతన్య, నారాయణ కాలేజీలను తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం నిషేధించాలని విద్యార్థి జనసమితి డిమాండ్ చేసింది. హైదరాబాద్ నార్సింగిలోని శ్రీ చైతన్య కాలేజ్‌లో ఇంటర్ చదువుతున్న ఎన్.సాత్విక్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నా సంఘటన దురదృష్టకరమని విద్యార్థి జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు సర్దార్ వినోద్ కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఆరున్ కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరు నాయక్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రవీణ్ ఆర్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాత్రి 10:30 సమయంలో తన క్లాస్‌రూమ్‌లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డ, యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదన్నారు.

కాలేజీలో ఒత్తిడి వల్లే అతడు ఆత్మహత్య చేసుకున్నాడని తోటి విద్యార్థులు చెప్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ అమాయక విద్యార్థులను ఫీజుల పేరుతో, ర్యాంక్‌ల పేరుతో ఒత్తిడి చేసి ప్రాణాలు తీస్తున్నారని ఆరోపించారు. శ్రీ చైతన్య ఘటనపై పోలీసులు కాలేజీ చైర్మన్ బీఎస్ రావు మీద హత్య కేసు నమోదు చేసి, అరెస్ట్ చేసి సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. అలాగే సాత్విక్ కుటుంబానికి యాజమాన్యం ఆదుకోవాలని కోరారు. కేసీఆర్ ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే, కోస్తాంధ్ర విద్యాసంస్థలు చైతన్య, నారాయణలను తెలంగాణలో నిషేధించాలని డిమాండ్ చేశారు.

కోస్తాంధ్ర విద్యాసంస్థల దోపిడీ మీద, వాటిలో జరుగుతున్న అవకతవకల మీద వాటిని తెలంగాణ నుంచి తరిమికొట్టే వరకు వీజేఎస్ అధ్వర్యంలో నిరంతరం పోరాటం చేస్తామని హెచ్చరించారు. విద్యార్థి కుటుంబాన్ని ఆదుకోవాలని, ఘటనా మీద విచారణ జరిపించాలని ధర్నా నిర్వహించిన వీజేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పేరాల ప్రశాంత్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు నరేందర్ నేతృత్వంలో విద్యార్థి నేతల బృందాన్ని అరెస్ట్ చేయడం చేయడం సరికాదని, న్యాయం చేయాలని అడిగితే అరెస్ట్ చేస్తారా అని ప్రశ్నించారు. వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Tags:    

Similar News