రాజీవ్ గాంధీ స్టేడియంలో ఆడినందుకే SRH‌కు ఫైనల్ బెర్త్.. వీహెచ్ సంచలన వ్యాఖ్యలు (వీడియో)

తరచూ కాంట్రవర్సీ కామెంట్స్ చేస్తూ కాంగ్రెస్ సీనియర్ వీహెచ్ హన్మంతరావు వార్తలో నిలుస్తూ ఉంటారు.

Update: 2024-05-25 07:46 GMT

దిశ, వెబ్‌డెస్క్: తరచూ కాంట్రవర్సీ కామెంట్స్ చేస్తూ కాంగ్రెస్ సీనియర్ వీహెచ్ హన్మంతరావు వార్తలో నిలుస్తూ ఉంటారు. ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్లు చెప్పడంలో.. అప్పటికప్పుడు ప్రత్యర్థి లీడర్ల మీద సెటైర్లు వేయడం హన్మంతరావు స్టైలే వేరు. అయితే శుక్రవారం జరిగిన ఐపీఎల్ ప్లేఆఫ్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై అద్భుతమైన విజయంతో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఐపీఎల్ ఫైనల్ చేరింది. ఈ విషయమై వీహెచ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ జట్టు రాజీవ్ గాంధీ స్టేడియంలో ఆడి ఆడి ఎక్స్ పర్ట్స్ అవడం వల్లే ఐపీఎల్ ఫైనల్‌కు వచ్చిందని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం వీహెచ్ సన్ రైజర్స్‌పై చేసిన కామెంట్స్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 


Similar News