గత్యంతరం లేక KCR ఆ పని చేస్తున్నాడంటా!

కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధాని మోడీని, బీజేపీని గట్టిగా విమర్శించడానికి ఖమ్మం సభను కేసీఆర్ వేదికగా...Special Story on KCR-Modi Plans

Update: 2023-01-15 03:42 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధాని మోడీని, బీజేపీని గట్టిగా విమర్శించడానికి ఖమ్మం సభను కేసీఆర్ వేదికగా చేసుకోవాలనుకున్నట్లు పార్టీ నేతల నుంచి కామెంట్లు వినిపించాయి. మరుసటి రోజున సికింద్రాబాద్ పర్యటనకు వచ్చే ప్రధాని మోడీ దీనికి ఏదో ఒక రీతిలో స్పందించడమో, సమాధానం చెప్పుకోవడమో తప్పదనే భావనలో ఉన్నారు. కానీ కేసీఆర్ ప్లాన్‌ను పసిగట్టిన ప్రధాని మోడీ అంతే వ్యూహాత్మకంగా తన టూర్‌ను వాయిదా వేసుకున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వచ్చి పచ్చ జెండా ఊపి వందేభారత్ రైలు సర్వీసును ప్రారంభించాలనుకున్న కార్యక్రమంలో మార్పులు చేసుకున్నారు. జనవరి 19వ తేదీకి బదులుగా సంక్రాంతి రోజే (జనవరి 15న) రిమోట్ ద్వారా వీడియో కాన్ఫరెన్సులో ఢిల్లీ నుంచే శ్రీకారం చుట్టనున్నారు.

ఊహలకు భిన్నంగా..

ప్రధాని టూర్ వాయిదా పడుతుందని బీఆర్ఎస్ నేతలు ఊహించలేకపోయారు. ఖమ్మం సభను సక్సెస్ చేయాలన్న ఉద్దేశంతో ఆ జిల్లా నేతలను కేసీఆర్ ప్రగతి భవన్ పిలిపించుకుని దిశానిర్దేశం చేశారు. ఇతర రాష్ట్రాల సీఎంలు కూడా వస్తారని ప్రకటించారు. ఐదు లక్షల మందిని తరలించేలా మంత్రులు, ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించారు. మంత్రి హరీశ్‌ రావును ఖమ్మంలోనే క్యాంపు వేసి సభా ఏర్పాట్లపైనా, జన సమీకరణపైనా దృష్టి పెట్టాలని వర్క్ డివిజన్ చేశారు. ఏపీ నుంచి కూడా నేతలను పిలిపించుకుని, ప్రజలను తరలించాలని ఆదేశించారు. దీంతో ఖమ్మం సభను కేసీఆర్ వాయిదా వేయలేకపోయారు. ఖమ్మం సభ గురించి ప్రధాని కార్యాలయానికి సైతం ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా సమాచారం చేరింది. కేసీఆర్ ఈ సభను హఠాత్తుగా ఎందుకు ఫిక్స్ చేయాల్సి వచ్చిందో తెలిసింది. సికింద్రాబాద్ ప్రోగ్రామ్‌ ను దృష్టిలో పెట్టుకునే కేసీఆర్ ఈ సభకు ప్లాన్ చేశారనే అంచనాకు వచ్చినట్లుంది. దీంతో కేసీఆర్ఊ హించని తీరులో సికింద్రాబాద్ ప్రోగ్రామ్‌ను వాయిదా వేశారు. ఖమ్మం సభను వాయిదా వేయలేని అనివార్య పరిస్థితినిసైతం తీసుకువచ్చారు. కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో కలెక్టరేట్ భవనాల ప్రారంభోత్సవం జరిగిన తర్వాత బహిరంగసభ పెట్టినట్లుగానే ఇప్పుడు ఖమ్మం జిల్లాలోనూ కొనసాగించనున్నారు.

Read more:

BRS తొలి ''పాన్ ఇండియా'' సభకు KTR దూరం.. మంత్రి వరుస డుమ్మాలకు కారణమేంటి..?

Tags:    

Similar News