ఆర్టీసీలో ప్రత్యేక ఉద్యమ కార్యాచరణ.. యూనియన్ నేతలు సమ్మెకు 'సై'

రాష్ట్ర ప్రభుత్వంపై టిఎస్ ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ నిరసన బావుటాను ఎగురవేసేందుకు సన్నధం అవుతుంది.

Update: 2023-06-14 16:33 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వంపై టిఎస్ ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ నిరసన బావుటాను ఎగురవేసేందుకు సన్నధం అవుతుంది. ఈ మేరకు ఆర్టీసీ యూనియన్ నాయకులూ తమ కార్యాచరణ ప్రణాలికను రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం తాము సూచించిన డిమాండ్లను నెరవేర్చకపోతే ఈ నెల 17 న రాష్ట్ర కమిటీ సమావేశంలో ప్రత్యేక్ష ఉద్యమ కార్యాచరణ ప్రణాళికను ప్రకటిస్తామని టిఎస్ ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కె. రాజిరెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కార్మిక సంఘాల కార్యకలాపాలను అనుమతించకుండా ట్రేడ్ యూనియన్ల హక్కులను కాలరాస్తోందని అయన ఆరోపించారు. బుధవారం తెలంగాణ ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 9 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో అయన ప్రసంగించారు.

ఈ సందర్బంగా అయన ప్రసంగిస్తూ.. హైకోర్టు సూచించిన విదంగా 3 నెలల లోపు ఆర్టీసిలో గుర్తింపు సంపు ఎన్నికలు నిర్వహించాలని, 2017, 2021 కి సంబంధించిన రెండు వేతన సవరణలు అమలు చేయాలని కోరారు. కార్మికులకు పేస్కేల్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. కార్మికులను వివిధ పని భారాలు మోపడం ఆపాలని , హై కోర్ట్ ఆదేశాల మేరకు తక్షణమే సిసిఎస్ లో 250 కోట్లు జమ చేయాలనీ అన్నారు . 2013 వేతన సవరణకు సంబంధించి 50% ఎరియర్స్ బాండ్ల డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేసారు. కారుణ్య నియామకాలు, మెడికల్ అనిఫిట్ అయినవారి కుటుంబ సభ్యులకు రెగ్యులర్ ప్రాతిపదికన ఉద్యోగం ఇవ్వాలని కోరారు. రిటైర్ అయితే వారికి సెటిల్మెంట్ డబ్బులు చెల్లించాలని అన్నారు.


Similar News