తెలంగాణలో ప్రత్యేక ఫారెస్ట్​స్టేషన్లు

క్షేత్రస్థాయి అటవీ ఉద్యోగులు, సిబ్బంది రక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తామని పీసీసీఎఫ్​ఆర్​ఎం డోబ్రియాల్​పేర్కొన్నారు. అటవీ అసోసియేషన్ల ప్రతిపాదనలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం అయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు.

Update: 2022-11-24 15:02 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : క్షేత్రస్థాయి అటవీ ఉద్యోగులు, సిబ్బంది రక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తామని పీసీసీఎఫ్​ఆర్​ఎం డోబ్రియాల్​పేర్కొన్నారు. అటవీ అసోసియేషన్ల ప్రతిపాదనలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం అయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రేంజర్ శ్రీనివాసరావు హత్య నేపథ్యంలో వివిధ అటవీ ఉద్యోగ సంఘాలతో అరణ్య భవన్ లో ఆయన సమావేశమయ్యారు. శ్రీనివాసరావు మృతికి నివాళులు అర్పించిన అధికారులు, రెండు నిమిషాలు మౌనం పాటించి, కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్ల అసోసియేషన్, ఫారెస్ట్ రేంజర్లు, స్టేట్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్, ఐ.ఎఫ్.ఎస్ అసోసియేషన్- తెలంగాణ చాఫ్టర్ ప్రతినిధులు జరిగిన సంఘటనను తీవ్రంగా ఖండిస్తూ తీర్మానం చేశారు. అటవీ సంరక్షణ పట్ల నిబద్దతతో పనిచేస్తున్నసిబ్బందిపై దాడులను నిరసించారు. ఇలాంటి సంఘటనలు భవిష్యత్ లో జరగకుండా చూడాలని ప్రభుత్వానికి విజ్జప్తి చేశారు.

ఈ సందర్భంగా డోబ్రియల్​ మాట్లాడుతూ.. క్షేత్రస్థాయి ఉద్యోగులు, సిబ్బంది రక్షణకు ఆయుధాలను ఇచ్చే ప్రతిపాదనను వెంటనే పరిష్కరించాల్సిన అవసరం ఉన్నదని ప్రభుత్వాన్ని కోరారు. ప్రత్యేక ఫారెస్ట్ స్టేషన్ల ఏర్పాటు, అటవీ శాఖలో ఖాళీల భర్తీ చేయాలన్నారు. రెవెన్యూ, పోలీసు శాఖలతో సమన్వయం మరింతగా పెంచేలా ఆదేశాలివ్వాలన్నారు. ఈ మేరకు డీజీపీ మహేందర్​ రెడ్డితో కూడా అటవీ శాఖ ఉన్నతాధికారులు భేటీ అయ్యారు. దీంతో పాటు అన్ని బీట్లలో అటవీ సరిహద్దులను ఖచ్చింతగా గుర్తించే ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. గొత్తి కోయలు పోడు సాగుదారుల కిందకు రారని, వారిని పూర్తిగా అటవీ ఆక్రమణదారులుగా గుర్తించి, అడవి నుంచి బయటకు తీసుకువచ్చే కార్యచరణ ప్రభుత్వం తీసుకోవాలని ప్రతిపాదించారు.ఈ సమావేశంలో పీసీసీఎఫ్ (కంపా) లోకేశ్ జైస్వాల్, పీసీసీఎఫ్ (ఎఫ్ఏసీ) ఎం.సీ. పర్గెయిన్, పీసీసీఎఫ్ (విజిలెన్స్) ఏలూసింగ్ మేరు, అదనపు పీసీసీఎఫ్ సునీతా భగవత్, ఇతర అధికారులు, సిబ్బంది, అన్ని అటవీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి 

తెలంగాణలో టీడీపీ భారీ వ్యూహం.. టార్గెట్‌ను ఛేదించేలా యాక్షన్ ప్లాన్? 

అటవీ అధికారిని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలి 

Tags:    

Similar News