Telangana ప్రభుత్వ పనితీరు అద్భుతం: పంజాబ్ స్పీకర్

పంజాబ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ సర్ధార్ కుల్తార్ సింగ్ సంధ్వాన్ తెలంగాణ శాసనసభను సందర్శించారు.

Update: 2022-12-27 07:01 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: పంజాబ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ సర్ధార్ కుల్తార్ సింగ్ సంధ్వాన్ తెలంగాణ శాసనసభను సందర్శించారు. ఆయనకు రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తెలంగాణ శాసనసభ నిర్వాహణ, పనితీరుపై పంజాబ్ స్పీకర్‌కు వివరించారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభ నిర్వాహణ అత్యుత్తమంగా ఉన్నదని, ప్రజా సమస్యలపై చర్చలు అర్ధవంతంగా జరుగుతున్నాయని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను పంజాబ్ బృందానికి స్పీకర్ పోచారం, చైర్మన్ గుత్తా వివరించారు. తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడినప్పటికీ అద్భుతాలు చేస్తున్నదని దేశ స్థాయిలో పేరు వచ్చిందని పంజాబ్ స్పీకర్ కుల్తార్ సింగ్ ప్రశంసించారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర శాసనసభ తరుపున పంజాబ్ స్పీకర్‌ను శాలువాతో సత్కరించి, మెమొంటో బహూకరించారు. పంజాబ్ రాష్ట్ర స్పీకర్‌తో పాటుగా ఆ రాష్ట్ర ఎమ్మెల్యే కల్వంత్ సింగ్ పండోరి, మాజీ ఎమ్మెల్యే అమర్ జీత్ సింగ్ ఉన్నారు. అంతేగాక, నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యుడు బిగాల గణేష్ గుప్తా, లెజిస్లేటివ్ సెక్రటరీ డా. వి.నరసింహా చార్యులు‌ పాల్గొన్నారు.

Also Read...

కర్ణాటక ప్రభుత్వంపై మంత్రి హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు 

Tags:    

Similar News

టైగర్స్ @ 42..