రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఈ నెల 30 నుండి మే 7 వరకు ఆ రైళ్లన్నీ రద్దు!
రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక అప్డేట్ ఇచ్చింది.
దిశ, వెబ్‌డెస్క్: రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక అప్డేట్ ఇచ్చింది. ఆధునీకరణ, భద్రతా పనుల వల్ల పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దువ్వాడ రైల్వే స్టేషన్‌లో ఆధునీకరణ పనుల వల్ల ఈ నెల 30వ తేదీ నుండి వచ్చే నెల 7వరకు పలు రైళ్లు రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది.
ఈ నెల 29, మే 6వ తేదీల్లో సికింద్రాబాద్-విశాఖ ఎక్స్ ప్రెస్ రైలు, ఈ నెల 30, మే 7 తేదీల్లో విశాఖ-సికింద్రాబాద్ ఎక్స్ ప్రెస్, మే 6, 7 తేదీల్లో విశాఖ- కాచిగూడ ఎక్స్ ప్రెస్, మే 5, 6 తేదీల్లో కాచిగూడ- విశాఖ ఎక్స్ ప్రెస్, మే 6న బిలాస్ పూర్- తిరుపతి ఎక్స్ ప్రెస్, మే 7న విశాఖ-సికింద్రాబాద్ దురంతో ఎక్స్ ప్రెస్, మే 6న సికింద్రాబాద్- విశాఖ దురంతో ఎక్స్ ప్రెస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించాలని సూచించారు.