రైల్ ప్రయాణికులకు అలర్ట్.. నేటి నుంచి 10 వరకు పలు రైళ్లు రద్దు

సికింద్రాబాద్‌ డివిజన్‌లో రైల్వే లైన్ల మరమ్మత్తుల పనుల్లో భాగంగా దక్షిణ మధ్య రైల్వే అధికారులు పలు రైళ్లను రద్దు చేశారు

Update: 2023-09-04 07:18 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: సికింద్రాబాద్‌ డివిజన్‌లో రైల్వే లైన్ల మరమ్మత్తుల పనుల్లో భాగంగా దక్షిణ మధ్య రైల్వే అధికారులు పలు రైళ్లను రద్దు చేశారు. కాజీపేట-డోర్నకల్‌, భద్రాచలం రోడ్‌-విజయవాడ, డోర్నకల్‌-కాజీపేట, విజయవాడ-భద్రాచలం రోడ్‌, కాజీపేట-సిర్పూర్‌ టౌన్‌, సికింద్రాబాద్‌-వరంగల్‌, వరంగల్‌-హైదరాబాద్‌, సిర్పూర్‌ టౌన్‌-కరీంనగర్‌ నిజమాబాద్- కరీంనగర్ గల 18 రైళ్ల సర్వీసులను రద్దు చేస్తున్నట్లు, కొన్నింటిని పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు తెలిపారు. నేటి నుంచి ఈ నెల 10 వరకు రైళ్లు రద్దు చేయనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు. అదేవిధంగా విశాఖపట్నం-లింగంపల్లి రైళ్లను ఈ నెల 9 వరకు, లింగంపల్లి-విశాఖపట్నం, రాయగడ-గుంటూరు, విజయవాడ- విశాఖపట్నం-విజయవాడ రైళ్లను ఈ నెల 10వ తేదీ వరకు రద్దు చేశారు.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..