చైన్ స్నాచింగ్ కేసులో కుమారుడికి రిమాండ్.. హోంగార్డు హల్‌చల్

హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న హోంగార్డు హల్ చల్ చేశాడు.

Update: 2024-07-15 03:36 GMT

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న హోంగార్డు హల్ చల్ చేశాడు. చైన్ స్నాచింగ్ కేసులో హోంగార్డు అజ్మీరా రాములు కుమారుడిని పోలీసులు రిమాండ్‌కు తరలించారు. తన కుమారుడినే రిమాండ్‌కు తరలిస్తారా అంటూ అజ్మీరా రాములు హల్‌చల్ చేశాడు. ఘట్ కేసర్ ఠాణాలో సీఐ ఛాంబర్ వద్దకు వెళ్లి రాములు విధులకు ఆటంకం కలిగించాడు. విధులకు ఆటంకం కలిగించారని అజ్మీరా రాములుపై ఎస్ఐ రాము ఫిర్యాదు చేశాడు. దీంతో విధులకు ఆటంకం కలిగించిన ఘటనలో హోంగార్డు అజ్మీరా రాములుపై కేసు నమోదైంది. అజ్మీరా రాములుపై ఘట్ కేసర్ ఠాణా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 


Similar News